14
February, 2026

A News 365Times Venture

14
Saturday
February, 2026

A News 365Times Venture

Director Shikha Goel: ఓటుకు నోటు కేసులో రిపోర్టులు సేఫ్..

Date:

Director Shikha Goel: నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికా గోయల్ స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో రిపోర్టులు సేఫ్‌గా ఉన్నాయని స్పష్టం చేశారు. ఉదయం 10.08 నిమిషాలకు ఎఫ్ఎస్ఎల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారని చెప్పారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారని.. 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. 2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయని తెలిపారు. కేసుకు సంభంచిన మెటీరియల్స్ 2021 లో ఏసీబీ కోర్టుకు పొందపరిచామని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని వెల్లడించారు..

READ MORE: Vellampalli Srinivas: లడ్డూలో ఫ్యాట్ ఉందని నిరూపిస్తారా.. కూటమి నేతలకు వెల్లంపల్లి ఛాలెంజ్..

ఇక్కడ ఆధారాలు కాలిపోయిన ఏసీబీ దగ్గర ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు.. “కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం లేదు.. ఓటుకు నోటు కేసులో యథావిధిగా నడుస్తుంది.. 2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్ కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫ్‌ఎస్‌ఎల్‌కి వచ్చాయి. మిగతా మెటీరియల్ అసిస్ట్ చేశాం.. ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి.. వీటిని రిట్రివ్ చేస్తాం.. ప్రమాదంపై విచారణ జరుగుతుంది.. ఇంత వరకు ఎంత నష్టం జరిగింది స్పష్టత లేదు.. ఈ కేసుకు సంభంచిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.” అని ఆమె స్పష్టం చేశారు.

READ MORE: Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಆರೋಗ್ಯ ಇಲಾಖೆಯಿಂದ ಅಬಕಾರಿ ಇಲಾಖೆಗೆ ವರ್ಗಾವಣೆಗೆ ಸಿಎಂ ಪತ್ರ: ಶಾಸಕ ಸುನೀಲ್ ಕುಮಾರ್ ಹೊಸ ಬಾಂಬ್

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,13,2026 (www.justkannada.in):  ಆರೋಗ್ಯ ಇಲಾಖೆಯಿಂದ ಅಬಕಾರಿ ಇಲಾಖೆಗೆ  ಅಧಿಕಾರಿಯೊಬ್ಬರನ್ನು ವರ್ಗಾಯಿಸುವಂತೆ...

സഭാ റെക്കോര്‍ഡുകളില്‍ നിന്ന് പ്രസംഗത്തിന്റെ ചില ഭാഗങ്ങള്‍ വെട്ടിനീക്കി; അന്യായ നടപടിയെന്ന് ഖാര്‍ഗെ

ന്യൂദല്‍ഹി: രാജ്യസഭയില്‍ നടത്തിയ പ്രസംഗത്തിന്റെ ചില ഭാഗങ്ങള്‍ സഭാ റെക്കോര്‍ഡുകളില്‍ നിന്ന്...