19
February, 2026

A News 365Times Venture

19
Thursday
February, 2026

A News 365Times Venture

Yellamma: ‘దేవిశ్రీ’కి కొత్త ఛాలెంజ్.. ఎల్లమ్మలో విలన్ గా సీనియర్ హీరో!

Date:

Yellamma: బలగం సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు.. తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’తో మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటు హీరో విషయంలోనూ, ఇటు విలన్ విషయంలోనూ ఆసక్తికరమైన అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి.

14550mAh భారీ బ్యాటరీ, 12.95 అంగుళాల డిస్‌ప్లేతో Brave Ark 2-in-1 Android డివైజ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇదిగో!

ఇదివరకు ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనే సస్పెన్స్‌కు తెరదించుతూ.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) పేరును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ అనే డప్పు కళాకారుడి పాత్రలో కనిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన గ్లింప్స్‌లో దేవి లుక్, నది ఒడ్డున వర్షంలో ఆయన కనిపిస్తున్న తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ‘తల్లి ఎల్లమ్మ’ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ కథ తెరకెక్కనుంది.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, విలన్ పాత్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందని టాక్. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఒకప్పటి లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో వడ్డే నవీన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా (విలన్) కనిపించబోతున్నారనీ సమాచారం. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నవీన్, వేణు చెప్పిన కథ వినగానే ఎగ్జైట్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ టాక్.

Prabhas: జపాన్ మ్యాగజైన్‌పై ప్రభాస్ రాజసం.. సోలోగా మెరిసిన తొలి ఇండియన్ హీరో!

‘పెళ్లి’ సినిమాతో రికార్డులు సృష్టించిన వడ్డే నవీన్, ఈ పవర్ ఫుల్ విలన్ పాత్రతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ‘బలగం’ సినిమాతో తెలంగాణ సంస్కృతిని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన వేణు.. ఇప్పుడు ఎల్లమ్మ కథతో అంతకు మించి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

தேர்தல் நெருக்கடியில் தொடரும் போராட்டங்கள்: `சதியா… உரிமையா?' – பரபரக்கும் தமிழ்நாட்டின் களம்!

போராட்டமும் - விவாதமும்தமிழ்நாட்டின் சட்டமன்றத் தேர்தல் நெருங்கிவரும் நிலையில், அரசு ஊழியர்கள்...

Shamar Joseph: వాహ్ నువ్వు తోపు భయ్యా..! ఒకే మ్యాచ్‌లో 4 వికెట్లు.. 4 క్యాచ్‌లు.. వరల్డ్ రికార్డ్!

Shamar Joseph: టీ20 వరల్డ్ కప్ జోరుగా సాగుతోంది. రికార్డులు, విజయోత్సవాల...