27
February, 2026

A News 365Times Venture

27
Friday
February, 2026

A News 365Times Venture

Stock Market: ట్రేడ్ డీల్‌తో పండిన ఇన్వెస్టర్లకు పంట.. రూ.20 లక్షల కోట్ల సంపాదన

Date:

దేశీయ స్టాక్ మార్కెట్‌ పెట్టుబడిదారుల పంట పండింది. గంటల వ్యవధిలోనే కోట్ల సంపాదన జేబుల్లో పడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. అన్ని పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లైంది.

భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం జరిగింది. ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత భారత్‌పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త భారతీయులకు కొత్త జోష్ తెప్పించింది. ఈ సందర్భంగా 140 కోట్ల మంది ప్రజల తరపున ట్రంప్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఇన్వెస్టర్లకు బాగా కలిసొచ్చింది. ఎన్నడూ లేనంతగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకుపోయింది. దీంతో గంటల వ్యవధిలోనే రూ.20 లక్షల కోట్ల సంపాదన వారి జేబుల్లో పడ్డాయి. దీంతో పెట్టుబడిదారులకు నూతనోత్సాహం వచ్చింది. ఇక ప్రధాని మోడీని ఎన్డీఏ ఎంపీలు ఘనంగా సన్మానించారు. ‘‘భారత్ మాతాకీ జై’’, ‘‘వందేమాతరం’’ నినాదాలతో మార్మోగించారు.

ఇది కూడా చదవండి: PM Modi: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్ సక్సెస్.. మోడీకి ఎంపీల సన్మానం

గతేడాది ప్రపంచ దేశాలపై ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తొలుత భారత్‌పై 25 శాతం సుంకం విధించగా.. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లుగా అయింది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత ట్రేడ్ డీల్ సక్సెస్ కావడంతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಉರ್ದು ಜಾಹೀರಾತು: ವಿಪಕ್ಷದ ನಾಯಕರ ಟೀಕೆಗಳಿಗೆ ಖಡಕ್ ತಿರುಗೇಟು ಕೊಟ್ಟ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ,26, 2026 (www.justkannada.in): ಉರ್ದು ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಸರ್ಕಾರದ ಜಾಹೀರಾತು...

പീഡനക്കേസിലെ അതിജീവിതമാരുടെ വിവരങ്ങൾ വെളിപ്പെടുത്തി; ആര്‍. ശ്രീലേഖക്കെതിരെ പോക്‌സോ കേസ്

തിരുവനന്തപുരം: പീഡനക്കേസിലെ ഇരകളുടെ പേര് വെളിപ്പെടുത്തിയതില്‍ മുന്‍ ഡി.ജി.പിയും ബി.ജെ.പി കൗണ്‍സിലറുമായ...

பாஜக அரசு vs நீதித்துறை: `NJAC (2014) டு NCERT (2026)' – ஆண்டுகள் கடந்தும் தொடரும் ‘நிழல் யுத்தம்’

என்.சி.இ.ஆர்.டி பாட புத்தகத்தில் இந்திய நீதித்துறையில் ஊழல்கள் என்ற தலைப்பில் பாடம்...