KTR : పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు ఎదురవుతున్న ఇబ్బందులు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. మొగులయ్యకు ఇంటి స్థల సమస్యతో పాటు కంటి చికిత్స బాధ్యతను కూడా స్వయంగా తీసుకుంటానని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో శనివారం మొగులయ్య కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు.
Lottery: రూ. 12 కోట్ల లాటరీని గెలుచుకున్న భర్త.. విడాకులు కోరిన భార్య.. కారణం ఏంటంటే?
హయత్‌నగర్ మండలంలో గత ప్రభుత్వం తనకు కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను మొగులయ్య వివరించారు. ఈ సమస్య పరిష్కారంలో సహాయం చేయాలని కోరారు. మొగులయ్య విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన కేటీఆర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో పూర్తి సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
Rishab Shetty : రిషబ్ శెట్టి గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూళ్లకు సాయం





