Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బుద్ధి ఇంకా మారలేదు. పహల్గామ్ దాడి తర్వాత, పాక్ సైన్యాన్ని ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా చిత్తు చేసినప్పటికీ, ఇంకా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు. మరోసారి, భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యాన్ని ప్యాంట్లు విప్పించి, పరిగెత్తిస్తున్నా కూడా తమది గ్రేట్ ఆర్మీ అని పాక్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. తమ వద్ద అణు ఆయుధాలు ఉన్నాయని బెదిరించే ప్రయత్నం చేశాడు.
Read Also: Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. పాక్ మొత్తం బ్రహ్మోస్ పరిధిలో ఉంది..
కాకుల్‌లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ (PMA)లో ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. తమ సైనిక సామర్థ్యాల శక్తి బాగా పెరిగిందని, భారత్ వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు చిన్నగా ఉన్నా కూడా పాకిస్తాన్ ఉహించని విధంగా, నిర్ణయాత్మకమైన జవాబు ఇస్తుందని హెచ్చరించాడు. విశాలమైన భారతదేశంలోని ప్రతీ ప్రాంతంపై పాకిస్తాన్ దాడి చేయగలదని బెదిరించాడు. భారత్‌లోని ఏ ప్రాంతాన్నైనా తమ ఆయుధాలు చేరగలవని బెదిరించాడు. అణ్వాయుధ వాతావరణంలో పోరాటానికి చోటు లేదు అని చెబుతూనే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
గతంలో పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కూడా ఆసిమ్ మునీర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. కాశ్మీర్ తమ జీవనాడి అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే పహల్గామ్‌లో లష్కరేతోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. 26 మంది అమాయకపు టూరిస్టులను హతమార్చారు. దీని తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించి పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ స్థావరాలపై దాడి చేసి, వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాక్ సైన్యం కవ్వింపులకు ధీటుగా బదులిస్తూ, పాక్ వైమానిక స్థావరాలను నాశనం చేసింది. ఇంత జరిగినా కూడా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు బుద్ధి రావడం లేదు.





