5
December, 2025

A News 365Times Venture

5
Friday
December, 2025

A News 365Times Venture

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Date:

నేడు ఉద్యోగ సంఘతో ప్రభుత్వం కీలక చర్చలు.. దీపావళి ముందు గుడ్‌న్యూస్‌..!
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టింది.. దీపావళికి రెండు రోజుల ముందు గుడ్ న్యూస్ చెప్పాలనుకుందో.. ఏమో.. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రులతో.. ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.. ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగుల డీఏ.. ఇతర అంశాలు చర్చించారు… ఇవాళ ముగ్గురు మంత్రులు.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు.. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహా మంత్రులు సత్యకుమార్‌ యాదవ్, నాదెండ్ల మనోహర్ లను ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ఇక, సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ ప్రతినిధులతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు.. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్య కుమార్‌ యాదవ్, నాదెండ్ల మనోహర్ చర్చలు జరుపనున్నారు.. ఉద్యోగుల ఆర్ధిక పరమైన సమస్యలకు సంబంధించి చర్చ జరగనుంది.. డీఏ బకాయిలకు సంబంధించి ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జరిగే చర్చల్లో డీఏ కు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు.. పెండింగ్ లో ఉన్న డీఏలతో పాటు కొత్త పీఆర్సీ కోరుతున్నారు.. జీపీఎఫ్ బకాయిలు.. కారుణ్య నియామకాలు. ప్రమోషన్లు.. అంతర్గత సమస్యలు… మెడికల్ రీ ఎంబర్స్‌మెంట్.. ఇలా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ జరిగే సమావేశంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

13 ఏళ్లు గడిచినా ఆమె ఆచూకీ తెలుసుకోలేకపోయారా..? హైకోర్టు విస్మయం..
కొన్ని కేసుల్లో సత్వర న్యాయం దొరికినా.. మరికొన్ని కేసుల్లో మాత్రం.. ఏళ్లు గడిచినా ఫలితం లేకుండా పోతుంది.. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులపై ఓ వివాహిత అదృశ్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఓ వివాహిత 13 ఏళ్ల క్రితం అదృశ్యమైతే ఆమె ఆచూకీని పోలీసులు ఇప్పటికీ తెలుసుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు.. ఆమె బతికుందో లేదో కూడా తెలియకుంటే..? ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మీకు తెలుసా? అంటూ పోలీసులను ప్రశ్నించింది హైకోర్టు.. తన కుమార్తె మిస్సింగ్‌ విషయంలో ఫలానా వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి.. ఫిర్యాదు చేస్తే.. ఆ వ్యక్తులను సకాలంలో విచారించకపోవడంపై సీరియస్‌ అయ్యింది హైకోర్టు.. అసలు, దర్యాప్తు ఎలా చేయాలో..? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదా? అంటూ ఫైర్‌ అయ్యింది.. అయితే, వ్యక్తుల మిస్సింగ్‌ కేసుల్లో ప్రతీ క్షణం కీలకమని పేర్కొంది హైకోర్టు.. ఘటన జరిగిన మొదట్లోనే ఫిర్యాదు చేస్తే.. ఆ తర్వాత ఎప్పుడో అనుమానితులను ప్రశ్నిస్తే ప్రయోజనం ఏంటి? అని ప్రశ్నించింది.. దర్యాప్తు విషయంలో ఏ మాత్రం మేం సంతృప్తికరంగా లేమంది హైకోర్టు.. ఈ కేసులో పురోగతిపై నివేదికను తమ ముందుంచాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, కొవ్వూరు డీఎస్పీ, తాడేపల్లిగూడెం ఎస్‌ఐలను ఆదేశించింది హైకోర్టు.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఆర్జీవీకి మరో షాక్‌.. రాజమండ్రిలో మరో కేసు నమోదు
ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ అలియాస్‌ రామ్ గోపాల్ వర్మకు మరో షాక్‌ తగిలింది.. ఆర్జీవీతో పాటు ఓ టీవీ ఛానల్‌ యాంకర్‌పై రాజమండ్రి త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. హిందూ ఇతిహాసాలు – దేవుళ్లు, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ దూషించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు. రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.. ఆర్జీవీతో పాటు సదరు యాంకర్‌పై క్రైమ్ నెం 487/2025, U/s 196 (1), 197(1) 353, 354,299 R/w (3) Bns Act, కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఓ మహిళా యాంకర్ వివాదాస్పద ప్రశ్నలను రామ్ గోపాల్ వర్మ కోసం ఉద్దేశపూర్వకంగా అడిగారని ఫిర్యాదులో మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే రామ్ గోపాల్ వర్మ వీడియోలు వెనుక విదేశీ టెర్రరిస్టులు ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. దీంతో, రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు ఆర్జీవీతో పాటు ఆ యాంకర్‌పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.. కాగా, ఇప్పటికే ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో.. వివిధ అంశాలపై ఆర్జీవీపై కేసులు ఎదుర్కొన్న విషయం విదితమే.

నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్.. విద్యా సంస్థలకు సెలవు..!
నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బంద్‌ ఫర్‌ జస్టిస్‌ పేరుతో నేడు బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చారు. బీసీ సంఘాల జేఏసీ బంద్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉదయం 8 గంటలకు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. తెలంగాణ భవన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి బంద్ లో పాల్గోనున్నారు. మండల, జిల్లా స్థాయిలో బంద్ లో పాల్గొనాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు అధిష్టానం ఇప్పటికే పిలుపునిచ్చింది. మరోవైపు.. ఈ రోజు ఉదయం రాజేంద్రనగర్ బస్ డిపో ముందు బీసీ నాయకులు బైటాయించారు. ఆర్టీసీ బస్సులను బయటకు రానివ్వకుండా బీసీ ఐక్య కులాల నాయకులు అడ్డుకున్నారు. బస్సు డిపో ముందు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులు బయటకు రానివ్వకుండా నాయకులు అడ్డుకున్నారు. ఇప్పటికే విద్యా సంస్థలకు మేనేజ్‌మెంట్‌లు సెలవులు ప్రకటించాయి.

విద్యార్థులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు సెలవులు..!
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. నేడు(శనివారం) బీసీ వర్గాల హక్కుల సాధన కోసం, 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత డిమాండ్‌తో రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అన్ని విద్యాసంస్థలు సెలవును ప్రకటించాయి. మరునాడు అక్టోబర్ 19 ఆదివారం కావడంతో అది వారపు సెలవు. ఆ మరుసటి రోజు, అంటే అక్టోబర్ 20 దీపావళి సెలవు. ఈ విధంగా సండే కలిసిరావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు లభించాయి. పాఠశాలలు, కళాశాలలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడతాయి. పండగ వేళ వరుస సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరిగంతేస్తున్నారు. మరోవైపు.. నేడు రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణలో ఉద్యమం ఉధృత రూపం దాలుస్తోంది.. నేడు రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపు ఇచ్చింది.. బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌తో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు రోడ్డుక్కుతున్నారు.. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.. ‘బంద్‌ ఫర్‌ జస్టిస్‌’ పేరుతో జరుగుతోన్న బీసీ సంఘాలు బంద్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అందరూ సహకరించి.. ఈ బంద్‌ను విజయంగా మార్చాలని బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.

ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తా.. అలీనగర్‌లో నామినేషన్ వేసిన మైథిలి ఠాకూర్
ప్రముఖ జనపద గాయని మైథిలి ఠాకూర్ అలీనగర్‌ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అలీనగర్ ప్రజల ఆశీస్సులు తనకు స్ఫూర్తి ఇచ్చాయని.. వారి ఆశీస్సులతో విజయం సాధిస్తానని మైథిలి ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. అలీనగర్ ప్రజలకు సేవ చేసేందుకు.. అభివృద్ధి, సంక్షేమం కోసం సంకల్పంతో పూర్తి శక్తితో పని చేస్తూ ఉంటానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలీ నగర్ ప్రజలకు సేవ చేయడానికి ఎన్డీఏ లక్ష్యాలు, ప్రజా సంక్షేమ విధానాలను ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి తీసుకెళ్లడానికి పూర్తి అంకితభావం, నిబద్ధతతో పని చేస్తూనే ఉంటాననని చెప్పుకొచ్చారు.

“అందితే జుట్టు అందకపోతే కాళ్లు”.. పాకిస్థాన్‌కు నమ్మక ద్రోహం కొత్తేం కాదు..!
పాకిస్థాన్‌కి నమ్మక ద్రోహం చేయడం అలవాటే.. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటుంది దాయాది దేశం. గతంలో భారత్- పాక్ మధ్య ఘర్షణలు జరిగినప్పుడు కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తరువాత కూడా ఉల్లంఘించి దాడులు జరిపింది. భారత్ దాడులకు తట్టుకోలేక.. మమ్మల్ని కాపాడండి అంటూ.. కాల్పుల విరమణ కోసం ఇతర దేశాలకు మొరపెట్టుకుంది. తీరా ఒప్పందం జరిగిన వెంటనే దాన్ని ఉల్లంఘించి దొడ్డిదారిన దాడులు చేసింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో సైతం అదే వైఖరిని అవలంబించింది. 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల్లోనే దాన్ని ఉల్లంఘించింది. ఆఫ్ఘన్‌పై వైమానిక దాడులు జరిపి ముగ్గురు క్రికెటర్లను సైతం పొట్టనపెట్టుకుంది. దీంతో మరోవైపు తాలిబన్ సైన్యం ఆగ్రహానికి గురవుతోంది. పాక్ ఉల్లంఘణను తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది.

పాకిస్థాన్ వైమానిక దాడి.. ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సహా 8 మంది మృతి
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు తీవ్ర అవుతున్నాయి. పాకిస్థాన్ వరుసగా వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్‌లో తీవ్ర నష్టం జరుగుతోంది. తాజా దాడిలో ముగ్గురు ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఆటగాళ్లు కబీర్, సిబ్ఘతుల్లా, పరూన్‌గా గుర్తించారు. మరో ఐదుగురు స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వచ్చే నెలలో పాకిస్థాన్-శ్రీలంకతో జరిగే త్రి-దేశాల సిరీస్‌లో పాల్గొనడానికి ఆటగాళ్లు పాకిస్థాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు వెళ్లినట్లుగా ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) తెలిపింది. ఒక సమావేశంలో ఉండగా క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ వైమానిక దాడికి పాల్పడిందని.. ఇది పిరికి దాడిగా ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అభివర్ణించింది. ఈ ఘటన తర్వాత ఆప్ఘనిస్థాన్ త్రి-దేశాల సిరీస్ నుంచి వైదొలిగింది.

కృతిశెట్టి కలల మీద నీళ్లు చల్లిన బాలీవుడ్ !
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన ముద్దు ముద్దు నడవడి, అమాయకమైన లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘ది వారియర్’ వంటి చిత్రాలతో వరుసగా బిజీ అయిపోయింది. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కృతి కెరీర్ కొంచెం డౌన్ ట్రాక్‌లోకి వెళ్లింది. ఇక దీంతో కృతి తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్లించింది. “హిందీ ఆడియెన్స్ ముందు తన టాలెంట్ చూపించాలనే డ్రీమ్ చాలా ఏళ్లుగా ఉందట” అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆ కల నిజమయ్యేలా ఒక అవకాశం కూడా వచ్చింది. బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద కుమారుడు యశ్వర్ధన్ అహుజా హీరోగా నటిస్తున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందని వార్తలు వచ్చాయి.

కొత్త లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్ తేజ్..!
మెగా హీరో వరుణ్ తేజ్ ఈ మధ్య కొంచెం కష్టకాలంలో ఉన్నాడు. గని, గంధీవధారి అర్జున వంటి వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపించాయి. దీంతో కొత్తదనంతో కూడిన సినిమాలకే వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి “కొరియన్ కనకరాజు” చిత్రం పై ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక యాక్షన్ కామెడీగా రూపొందుతోంది. ఇందులో వరుణ్ మరోసారి కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని సమాచారం. నవంబర్ చివరి నాటికి అన్ని షెడ్యూల్స్ పూర్తవుతాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా ఆయన విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి సైన్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ గతేడాదే ఫైనల్ అయినప్పటికీ, షూటింగ్ తేదీలు, స్క్రిప్ట్ చర్చల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు అన్ని క్లారిటీ రావడంతో, డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలుకానుందట. ప్రేమ కథ, ఎమోషనల్, స్టైలిష్ ప్రెజెంటేషన్ అని కలిపి రూపొందనున్న ఈ మూవీ వరుణ్ కెరీర్‌కు తిరిగి మంచి బూస్ట్ ఇవ్వగలదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೌಡಿ sahacharaninda ಜೀವ ಬೆದರಿಕೆ: cm ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ನವೆಂಬರ್,11,2025 (www.justkannada.in): ಕುರುಬರ ಸಂಘದ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾಗಿ ಆಗದಂತೆ ನನಗೆ...

‘MAHAN’ ವತಿಯಿಂದ ನ.14 ರಂದು ಮೈಸೂರಿನಾದ್ಯಂತ ಸರಣಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ವಿಶ್ವ ಮಧುಮೇಹ ದಿನಾಚರಣೆ ಅಂಗವಾಗಿ ನವೆಂಬರ್ 14...

ಇನ್ನರ್ ವೀಲ್ ನ ಧ್ಯೇಯವಾಕ್ಯವೇ ಸ್ನೇಹ ಮತ್ತು ಸೇವೆ- ಶಬರೀಕಡಿದಾಳು

ಹುಣಸೂರು, ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಇನ್ನರ್ ವೀಲ್ ವಿಶ್ವದ ಅತಿದೊಡ್ಡ ಮಹಿಳಾ...

ಪೊಲೀಸರು ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ -ಬಿ.ಚೈತ್ರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಪೊಲೀಸ್ ಎಂದರೆ ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ....