28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

Hamas: హమాస్ చెరలో నేపాలీ హిందూ విద్యార్థి మృతి..

Date:

Hamas: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్-హమాస మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. 2 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపేశారు. 20 మంది బతికి ఉన్న బందీలను హమాస్ విడుదల చేస్తోంది. బందీల విడుదలతో ఇజ్రాయిల్ మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ ఆనందం మాటున ఒక విషాదం కూడా దాగుంది. రెండేళ్ల క్రితం అక్టోబర్ 07,2023లో హమాస్ జరిపిన దాడిలో, కిడ్నాప్‌కు గురైన నేపాల్ హిందూ విద్యార్థి బిపిన్ జోషి మరణించారు. అతడి మృతదేహాన్ని ఇజ్రాయిల్‌కు తిరిగి ఇచ్చారు.

ఇజ్రాయిల్ లోని నేపాల్ రాయబారి ధన్ ప్రసాద్ పండిత్, బిపిన్ జోషి మరణాన్ని ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని టెల్ అవీవ్‌కు తీసుకువస్తున్నట్లు చెప్పారు. జోషితో సహా మరణించిన నలుగురు బందీల మృతదేహాలను హమాస్ ఇజ్రాయిల్‌కు ఇచ్చినట్లు ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ చెప్పారు. నేపాల్‌కు జోషి మృతదేహం తిరిగి పంపించే ముందు, డీఎన్ఏ టెస్ట్ నిర్వహించనున్నారు. నేపాల్ రాయబార కార్యాలయం సమన్వయంతో ఇజ్రాయిలో‌లో అంత్యక్రియలు నిర్వహించబడుతాయి.

Read Also: Maithili Thakur: బీజేపీలోకి మైథిలి ఠాకూర్, బీహార్ ఎన్నికల్లో పోటీ.. ఈమెకు ఇంత క్రేజ్ ఎలా.?

నేపాల్ లోని చిన్న పట్టణం నుంచి జోషి సెప్టెంబర్ 2023లో ఇజ్రాయిల్ వెళ్లారు. అంటే కిడ్నాప్‌కు ఒక నెల ముందే ఆయన ఇజ్రాయిల్ వెళ్లారు. గాజా సరిహద్దుకు సమీపంలోని కబ్బట్జ్ అటుమిమ్‌లో వ్యవసాయం అధ్యయనం, వర్క్ ప్రోగ్రామ్ కోసం 16 మంది తోటి విద్యార్థులతో చేరారు. ఇజ్రాయిల్ వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేయడాని, శిక్షణ తీసుకోవడానికి అక్కడి వెళ్లాడు.

అక్టోబర్ 7, 2023 లో దక్షిణ ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేసింది. దాడి తర్వాత సైరన్లు మోగగా విద్యార్థులు బాంబు షెల్టర్‌లోకి వెళ్లారు. క్షణాల్లో కాల్పులు, పేలుళ్లు చెలరేగాయి. హమాస్ ఉగ్రవాదులు షెల్టర్‌లోకి గ్రెనేడ్లనె విసిరారు. ఒకటి పేలడంతో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. అయితే రెండో గ్రెనేడ్‌ను జోషి పట్టుకుని, అది పేలి పోమే ముందు బయటకు విసిరారు. దీని తర్వాత, అతడిని హమాస్ ఉగ్రవాదులు బంధించి, గాజాలోకి తీసుకెళ్లారు. చివరి సారిగా, ఇజ్రాయిల్ సైన్యం విడుదల చేసిన వీడియోలో జోషిని గాజాలోని షిఫా ఆస్పత్రిలోకి లాగుతున్నట్లు కనిపించింది. ఆ సమయంలో అతను సజీవంగా ఉన్నాడు. జోషి సజీవంగా తిరిగి వస్తాడని కుటుంబం భావించింది. చివరకు విషాదం నెలకొంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನಾಳೆಯಿಂದ IPL:  ಅಧಿಕಾರಿಗಳ ಜೊತೆ ಸಿಎಸ್ ಸುದೀರ್ಘ ಸಭೆ, ಸಲಹೆ ಸೂಚನೆ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,27,2026 (www.justkannada.in): ನಾಳೆಯಿಂದ IPL ಪಂದ್ಯಾವಳಿಗಳು ಆರಂಭವಾಗಲಿರುವ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ರಾಜ್ಯ...

‘ടീം ഇന്ത്യയായി ഒത്തൊരുമിച്ച് പ്രവര്‍ത്തിക്കണം’; പശ്ചിമേഷ്യന്‍ സംഘര്‍ഷത്തില്‍ മുഖ്യമന്ത്രിമാരുടെ യോഗം വിളിച്ച് പ്രധാനമന്ത്രി

ന്യൂദല്‍ഹി: പശ്ചിമേഷ്യന്‍ സംഘര്‍ഷത്തിന്റ സാഹചര്യത്തില്‍ രാജ്യത്തെ എല്ലാ സംസ്ഥാനങ്ങളിലെയും കേന്ദ്ര ഭരണപ്രദേശങ്ങളിലെയും...

'கூட்டம் கூடுவதற்கு ஏற்ற இடமல்ல' – விஜய்யின் பிரசாரத்துக்கு தேர்தல் அலுவலர் அனுமதி மறுத்தது ஏன்?

தவெக தலைவர் விஜய் நாளை பெரம்பூரிலிருந்து தனது பிரசாரத்தை தொடங்குவதாக திட்டமிட்டிருந்தார்....

Heart Touching Story : చనిపోయినా విడిపోలేదు.. విగ్రహాలు కట్టి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు.!

ప్రేమకు చావు లేదని చాటిచెప్పే ఉదంతాలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మహబూబాబాద్...