28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

Shorna Akter: 18 ఏళ్లకే నయా హిస్టరీ.. భళా షోర్నా అక్తర్‌!

Date:

ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ 2025లో థ్రిల్లింగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన గత మూడు మ్యాచ్‌లలోనూ రసవత్తర పోరులు జరిగాయి. సోమవారం జరిగిన బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. బంగ్లాకు గెలిచే ఛాన్స్ వచ్చినా.. చివరి వరకు పోరాడి ప్రొటీస్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా యువ క్రీడాకారిణి షోర్నా అక్తర్‌ నయా హిస్టరీ క్రియేట్ చేసింది.

Also Read: Gold Rate Today: షాకింగ్ న్యూస్.. ఒక్కరోజులోనే రూ.3280 పెరిగిన బంగారం ధర! 2 లక్షలు దాటిన వెండి

బంగ్లాదేశ్ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును షోర్నా అక్తర్‌ నెలకొల్పింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదింది. ఈ క్రమంలో సుల్తానా రికార్డును బద్దలు కొట్టింది. ఈ సంవత్సరం ప్రారంభంలో మహిళల ప్రపంచకప్ క్వాలిఫైయర్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సుల్తానా 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదింది. అంతేకాదు ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (3) కొట్టిన తొలి బంగ్లాదేశ్ మహిళా క్రీడాకారిణిగా కూడా నిలిచింది. 2023లో శ్రీలంకతో జరిగిన వన్డేలో సుల్తానా రెండు సిక్సర్లు బాదింది. 18 ఏళ్ల వయసులోనే షోర్నా రెండు ప్రపంచ రికార్డులు సృష్టించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನಾಳೆಯಿಂದ IPL:  ಅಧಿಕಾರಿಗಳ ಜೊತೆ ಸಿಎಸ್ ಸುದೀರ್ಘ ಸಭೆ, ಸಲಹೆ ಸೂಚನೆ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,27,2026 (www.justkannada.in): ನಾಳೆಯಿಂದ IPL ಪಂದ್ಯಾವಳಿಗಳು ಆರಂಭವಾಗಲಿರುವ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ರಾಜ್ಯ...

‘ടീം ഇന്ത്യയായി ഒത്തൊരുമിച്ച് പ്രവര്‍ത്തിക്കണം’; പശ്ചിമേഷ്യന്‍ സംഘര്‍ഷത്തില്‍ മുഖ്യമന്ത്രിമാരുടെ യോഗം വിളിച്ച് പ്രധാനമന്ത്രി

ന്യൂദല്‍ഹി: പശ്ചിമേഷ്യന്‍ സംഘര്‍ഷത്തിന്റ സാഹചര്യത്തില്‍ രാജ്യത്തെ എല്ലാ സംസ്ഥാനങ്ങളിലെയും കേന്ദ്ര ഭരണപ്രദേശങ്ങളിലെയും...

'கூட்டம் கூடுவதற்கு ஏற்ற இடமல்ல' – விஜய்யின் பிரசாரத்துக்கு தேர்தல் அலுவலர் அனுமதி மறுத்தது ஏன்?

தவெக தலைவர் விஜய் நாளை பெரம்பூரிலிருந்து தனது பிரசாரத்தை தொடங்குவதாக திட்டமிட்டிருந்தார்....

Heart Touching Story : చనిపోయినా విడిపోలేదు.. విగ్రహాలు కట్టి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు.!

ప్రేమకు చావు లేదని చాటిచెప్పే ఉదంతాలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మహబూబాబాద్...