29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

Supermoon : ఆకాశంలో అరుదైన అద్భుతం రేపు, ఎల్లుండి

Date:

Supermoon : ఆకాశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించే ఖగోళ అద్భుతం ఈసారి భారతదేశ ఆకాశాన్నీ ప్రకాశవంతం చేయబోతోంది. రేపు (సోమవారం) , ఎల్లుండి (మంగళవారం) సూపర్ మూన్‌ (Super Moon) రూపంలో ఆకాశం అందాల పండుగను సాక్షాత్కరించనుంది. ఈ సందర్భంగా చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే దానికంటే మరింత పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు కొన్ని సందర్భాల్లో భూమికి అత్యంత సమీపంగా వస్తాడు. ఆ సమయానికే పౌర్ణమి తారీఖు రావడంతో సూర్య కాంతి మొత్తం చంద్రునిపై ప్రతిఫలించి అతని ప్రకాశం అనూహ్యంగా పెరుగుతుంది. ఈ సందర్భాన్నే ఖగోళ శాస్త్రజ్ఞులు “సూపర్ మూన్” అని పిలుస్తారు.

INDW vs PAKW: చేతులెత్తేసిన పాకిస్థాన్‌ బ్యాటర్లు.. భారీ విజయం దిశగా టీమిండియా!

ఖగోళ పరిశోధకుల వివరాల ప్రకారం .. ఈ సూపర్ మూన్ సమయంలో చంద్రుడి పరిమాణం సాధారణ పౌర్ణమి చంద్రుడి కంటే 14 శాతం పెద్దగా, అలాగే 30 శాతం ఎక్కువ వెలుగుతో కనిపించనుంది. అంటే ఆకాశం అంతా చంద్రకాంతితో నిండిపోతుంది. నగరాల వెలుగులు తగ్గిన ప్రాంతాల్లో, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సూపర్ మూన్ అద్భుతంగా దర్శనమిస్తుంది.

ఇక ఇది సంవత్సరంలో చివరి త్రైమాసికానికి ముందురోజులలో కనబడే సూపర్ మూన్ కావడంతో, దీనిని “హార్వెస్ట్ మూన్” (Harvest Moon) అని కూడా పిలుస్తారు. సంప్రదాయంగా ఈ కాలంలో రైతులు పంటలు కోసే సీజన్‌ కావడంతో, రాత్రి వెలుతురు ఎక్కువగా ఉండే ఈ పౌర్ణమిని ఆ పేరు పెట్టారు. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో కూడా మరో రెండు సూపర్ మూన్స్ దర్శనమివ్వనున్నాయి. దీంతో ఖగోళ ప్రేమికులు, ఆకాశ వీక్షకులు ఈ మూడు చంద్ర దర్శనాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ మూన్‌ను ప్రత్యేక పరికరాలు లేకుండానే కన్నులారా వీక్షించవచ్చు. కానీ, ఆకాశం స్పష్టంగా ఉండే ప్రాంతాల్లో చూడడం ఉత్తమం. వాతావరణం మబ్బుగా లేకపోతే, చంద్రుడు తన సంపూర్ణ కాంతితో ప్రజలకు కనువిందు చేయనున్నాడు.

Khawaja Asif: అదే జరిగితే భారత్ యుద్ధ విమానాలు సమాధి అవుతాయి.. పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബി.ജെ.പി സീല്‍ വിവാദം: ഡെപ്യൂട്ടി സി.ഇ.ഒ മിഷാല്‍ സാഗര്‍ ഭരതിനെ മാറ്റി

തിരുവനന്തപുരം: തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന്‍ രാഷ്ട്രീയ പാര്‍ട്ടികള്‍ക്കയച്ച കത്തില്‍ ബി.ജെ.പിയുടെ സീല്‍ ഉള്‍പ്പെട്ട...

அண்ணாவுக்கு பிறகு… நெடுஞ்செழியனை முந்தி கருணாநிதி முதல்வராக, திமுக தலைவராக மாறிய கதை! ஆடுபுலி 11

திமுகவில் துரைமுருகன், கே.என்.நேரு, பொன்முடி, டி.ஆர்.பாலு, ஆ.ராசா, அதிமுகவில் திண்டுக்கல் சீனிவாசன்,...

Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ఎవరైనా యుద్ధానికి ముందు వ్యూహరచన చేస్తారు. యుద్ధం మొదలయ్యాక కూడా అవసరమైతే...

ʼಮುಖ್ಯಮಂತ್ರಿ ಪದಕʼ ಪ್ರಕಟ: ಮೈಸೂರಿನ ನಾಲ್ವರು ಸೇರಿ ರಾಜ್ಯದ 153 ಪೊಲೀಸರಿಗೆ ಗೌರವ

  ಬೆಂಗಳೂರು, ಮಾ.೨೮,೨೦೨೬ : 2025ನೇ ಸಾಲಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪದಕ (CM...