30
March, 2026

A News 365Times Venture

30
Monday
March, 2026

A News 365Times Venture

Arshdeep Singh: సూపర్ ఓవర్‌లో నా ప్రణాళిక అదే.. అసలు విషయం చెప్పేసిన అర్ష్‌దీప్‌!

Date:

ఆసియా కప్‌ 2025 సూపర్‌ 4లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ టైగా మారితే.. అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్భుత బౌలింగ్‌తో శ్రీలంకను కట్టడి చేశాడు. మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ పెద్దగా ప్రభావం చూపలేదు. 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. సూపర్‌ ఓవర్‌లో మాత్రం అదరగొట్టాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి.. పెరీరా, శనకను అవుట్ చేసి హీరో అయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ సూపర్‌ ఓవర్‌లో తన ప్రణాళిక ఏంటో అర్ష్‌దీప్‌ చెప్పాడు.

‘పవర్ ప్లేలో మేం భారీగా పరుగులు ఇచ్చాం. మిగతా బౌలర్లందరూ బాగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌ వరకు తీసుకెళ్లారు. సూపర్ ఓవర్‌లో నా ప్రణాళిక స్పష్టంగా ఉంది. వైడ్ యార్కర్లు వేసి శ్రీలంక బ్యాటర్లను ఆఫ్‌సైడ్‌ ఆడించాలని చూశా. అది వర్కౌట్ అయింది. జట్టు విజయంలో నా భాగస్వామ్యం ఉన్ననందుకు సంతోషంగా ఉంది. నిత్యం మానసికంగా సిద్ధంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తా. మ్యాచ్‌లో వంద శాతం బెస్ట్‌ ఇవ్వాలని చూస్తా. అవకాశం దక్కనప్పుడు కూడా మైదానం వెలుపలా వందశాతం ఇచ్చేందుకు ప్రయత్నించాలి. శిక్షణ, ఫిట్‌నెస్‌ మీద పూర్తి దృష్టి పెట్టాలి’ అని అర్ష్‌దీప్ సింగ్‌ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

Also Read: TVK Vijay: అల్లు అర్జున్‌ మాదిరి.. హీరో విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?

ఆసియా కప్‌ 2025లో అర్ష్‌దీప్‌ సింగ్‌ ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి.. జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్‌గా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా రెండో పేసర్‌గా ఉన్నాడు. దాంతో అర్ష్‌దీప్‌కు అవకాశం రాలేదు. శ్రీలంక మ్యాచ్‌లో బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో అర్ష్‌దీప్‌కు అవకాశం దక్కింది. ఆసియా కప్‌ 2025 ఫైనల్‌ ఆదివారం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత్, పాకిస్థాన్‌ మధ్య జరగనుంది. ఫైనల్‌లో బుమ్రా తిరిగి రానున్న నేపథ్యంలో అర్ష్‌దీప్‌కు నిరాశ తప్పదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಇರಾನ್ ಭಾರತದ ಮಿತ್ರರಾಷ್ಟ್ರವಾಗಿದ್ದಕ್ಕೆ ನಮ್ಮ ಹಡಗುಗಳನ್ನು ಮಾತ್ರ ಬಿಡುತ್ತಿದ್ದಾರೆ-ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,28,2026 (www.justkannada.in): ಇರಾನ್ ಭಾರತದ ಮಿತ್ರ ರಾಷ್ಟ್ರ. ಹೀಗಾಗಿ ನಮ್ಮ...

സത്യത്തെ വധിക്കുക എന്നതാണ് ഇസ്രഈലിന്റെ ലക്ഷ്യം; ലബനീസ് മാധ്യമ പ്രവർത്തകരുടെ കൊലയിൽ അപലപിച്ച് അരാഗ്ചി

ടെഹ്‌റാൻ: ലബനീസ് മാധ്യമ പ്രവർത്തകരുടെ കൊലപാതകത്തിൽ അപലപിച്ച് ഇറാൻ വിദേശകാര്യ മന്ത്രി...

திமுக தேர்தல் அறிக்கை: 'TV, Fridgeக்கு ரூ. 8000 மதிப்பிலான கூப்பன், 10 லட்சம் வீடுகள்'- முழு லிஸ்ட்

திமுக வருகிற சட்டமன்றத் தேர்தலில் 164 தொகுதிகளில் போட்டியிடுகிறது. நேற்று, போட்டியிடப்...

KKR vs MI : ముంబై ఇండియన్స్ చారిత్రాత్మక విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెర.!

KKR vs MI : ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో...