30
March, 2026

A News 365Times Venture

30
Monday
March, 2026

A News 365Times Venture

IND vs PAK Final: పాకిస్థాన్‌తో ఫైనల్‌ మ్యాచ్.. ఆ ఇద్దరు భారత ఆటగాళ్లపై వేటు!

Date:

ఆసియా కప్‌ 2025లో ఆదివారం (సెప్టెంబర్ 28) దాయాది పాకిస్థాన్‌తో భారత్‌ ఫైనల్‌లో తలపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్, సూపర్-4లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు వరుస పరాభవాలకు చెక్ పెట్టాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్‌లో భారత్ తుది జట్టు ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.

ఫైనల్‌కు ముందు శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్‌ శివమ్ దూబేలకు టీమిండియా మాజేన్మెంట్ రెస్ట్ ఇచ్చింది. పాకిస్థాన్‌తో ఫైనల్‌లో ఈ ఇద్దరు తిరిగి జట్టులోకి రానున్నారు. దాంతో పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నారు. విన్నింగ్ కాంబినేషన్‌ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొనసాగించనున్నాడు. శ్రీలంక మ్యాచ్‌లో కండరాలు పట్టేసిన అభిషేక్‌ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు ఆడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. గాయపడిన వారిలో ఎవరైనా ఆడకుంటే అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్‌, జితేష్ శర్మలు సిద్ధంగా ఉన్నారు.

ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. కెప్టెన్ సూర్య దారుణంగా విఫలమయ్యాడు. ఫైనల్లో అయినా 360 డిగ్రీస్ చూపించాల్సి ఉంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఫామ్‌లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో రాణిస్తున్న శివమ్ దూబే బ్యాటింగ్‌లో సత్తా చాటాల్సి ఉంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలు రాణిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ తీయాల్సి ఉంది.

Also Read: IND vs PAK Final: పాకిస్థాన్‌తో ఫైనల్‌ మ్యాచ్ ముందు.. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు గాయం!

భారత్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഓശാന ദിനത്തിൽ പള്ളിയിൽ പ്രവേശനം നിഷേധിച്ച ഇസ്രഈൽ പൊലീസ് നടപടി; അപലപിച്ച് വത്തിക്കാൻ

ജെറുസലേം: ഓശാന ദിനത്തിൽ ജറുസലേമിലെ ‘ചർച്ച് ഓഫ് ദി ഹോളി സ്‌പൽച്ചർ’...

'சர்வே முடிவுகள்; கட்சிக் கட்டமைப்பு; MLA மீதான அதிருப்தி'- விஜய் பெரம்பூரை டிக் அடிக்க காரணம் என்ன?

விஜய், பெரம்பூர் தொகுதியில் போட்டியிடப் போவதாக அவரே அறிவித்திருக்கிறார். நாளையே வேட்புமனுவையும்...

Chairman’s Desk : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ పెను మార్పులు తెస్తుందా?

నియోజకవర్గాల పునర్విభజనతోపాటు దేశంలో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి....

ಇರಾನ್ ಭಾರತದ ಮಿತ್ರರಾಷ್ಟ್ರವಾಗಿದ್ದಕ್ಕೆ ನಮ್ಮ ಹಡಗುಗಳನ್ನು ಮಾತ್ರ ಬಿಡುತ್ತಿದ್ದಾರೆ-ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,28,2026 (www.justkannada.in): ಇರಾನ್ ಭಾರತದ ಮಿತ್ರ ರಾಷ್ಟ್ರ. ಹೀಗಾಗಿ ನಮ್ಮ...