30
March, 2026

A News 365Times Venture

30
Monday
March, 2026

A News 365Times Venture

200MP టెలిఫోటో కెమెరా, 7,000mAh బ్యాటరీలతో వచ్చేస్తున్న Realme GT 8 Series!

Date:

Realme GT 8 Series: రియల్‌మీ జీటీ 8 సిరీస్ (Realme GT 8 Series) స్మార్ట్ ఫోన్లు వచ్చే నెలలో చైనాలో విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియంది. రియల్‌మీ జీటీ 8 (Realme GT 8), రియల్‌మీ జీటీ 8 ప్రో (Realme GT 8 Pro) మోడళ్లను ఈ సిరీస్‌లో భాగంగా విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ల కోసం ప్రస్తుతం చైనాలో ప్రీ ఆర్డర్లు మొదలయ్యాయి. రియల్‌మీ (Realme) తన అధికారిక పోస్ట్‌లో రియల్‌మీ జీటీ 8 సిరీస్ చైనాలో అక్టోబర్‌లో విడుదల కానుందని ప్రకటించింది. అయితే, కచ్చితమైన తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

సరికొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో లాంచ్‌కి ముహూర్తం ఖరారు చేసుకున్న Xiaomi 17 Series!

రియల్‌మీ జీటీ 8 సిరీస్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు చైనాలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రీ బుకింగ్ ఉచితంగా చేసుకోవచ్చని, అయితే చిన్న మొత్తంలో రుసుము చెల్లించిన కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. కొన్ని నివేదికల ప్రకారం, రియల్‌మీ జీటీ 8 సిరీస్ ఫోన్లలో వెనుకవైపు 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. ఈ మొబైల్స్ కో ఫ్లాట్ 2కే (flat 2K AMOLED display) అమోలెడ్ డిస్‌ప్లేను అందించనున్నారు. క్వాల్కమ్ నుంచి రాబోయే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ (Snapdragon 8 Elite Gen 5)తో విడుదలయ్యే మొదటి ఫోన్లలో ఈ సిరీస్ కూడా ఉండవచ్చని సమాచారం.

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్-2, 3 పార్టులు పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది

రియల్‌మీ జీటీ 8 ఫోన్‌లో 6.6 అంగుళాల స్క్రీన్ ఉండవచ్చు. అలాగే 7,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించే అవకాశం ఉంది. సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు మెటల్ ఫ్రేమ్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ ఫోన్ గత ఏడాది విడుదలైన రియల్‌మీ జీటీ 7 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా మార్కెట్లోకి వస్తుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಯತ್ನಾಳ್ ಮರಳಿ ಬಿಜೆಪಿ ಸೇರಲು ಉಪಚುನಾವಣೆ ಒಳ್ಳೆಯ ಅವಕಾಶ- ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ವಿಜಯಪುರ,ಮಾರ್ಚ್,30,2026 (www.justkannada.in):  ಬಿಜೆಪಿ ಪಕ್ಷದಿಂದ ಉಚ್ಛಾಟಿತರಾಗಿರುವ ಶಾಸಕ ಬಸನಗೌಡ ಪಾಟೀಲ್...

മനുഷ്യരുടെ എല്ലാ വോട്ടും വേണം, മതവര്‍ഗീയതയോട് യോജിപ്പില്ല; എസ്.ഡി.പി.ഐ വോട്ട് സ്വീകരിക്കുമോ എന്ന ചോദ്യത്തില്‍ ബിനോയ് വിശ്വം

കൊച്ചി: എല്ലാ മനുഷ്യരുടെയും വോട്ടുകള്‍ സ്വീകരിക്കുമെന്നും എന്നാല്‍ മതവര്‍ഗീയ സംവിധാനങ്ങളോട് ആശയപരമായി...

தேர்தல்: 'தனித்தொகுதி' Vs 'பொதுத்தொகுதி' – என்ன கணக்கு… எப்படி உருவானது?!

தமிழகத்தில் சட்டமன்றத் தேர்தல் திருவிழா களைகட்டத் தொடங்கிவிட்டது. அரசியல் கட்சிகளுக்கு இடையிலான...