31
March, 2026

A News 365Times Venture

31
Tuesday
March, 2026

A News 365Times Venture

CM Revanth Reddy : ట్రంప్ H1B వీసా నిర్ణయంపై తెలంగాణ సీఎం రేవంత్ ఏమన్నారంటే..?

Date:

CM Revanth Reddy : అమెరికాలో విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశీ ఉద్యోగులను నియమించుకునే యూఎస్ కంపెనీలు ప్రభుత్వానికి 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 88 లక్షలు అవుతుంది. ఈ చర్య భారతీయ ఐటీ ఉద్యోగులను, ముఖ్యంగా టెక్కీలను గణనీయంగా ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం H-1B వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు.

CMRF CHEATING : తెలంగాణ ప్రభుత్వ ఖజానాకే కన్నం

ఈ నిర్ణయంతో అనేక యూఎస్ కంపెనీలు స్థానిక అమెరికన్లను నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాయని ట్రంప్ పరిపాలన పేర్కొంది. తక్కువ ఖర్చుతో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు స్వదేశాలకు వెళ్లిపోతారని యూఎస్ వాణిజ్య కార్యదర్శి వ్యాఖ్యానించారు. అలాగే, H-1B వీసా వ్యవస్థను ఐటీ అవుట్ సోర్సింగ్ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని, ఇది అమెరికా జాతీయ భద్రతకు కూడా ముప్పు అని ట్రంప్ ఆరోపించారు.

ఈ పరిణామంపై తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ “అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఆ ఆర్డర్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. భారత-అమెరికా సంబంధాల్లో ఇది సరైనది కాదు. మన సాంకేతిక నిపుణులు, నైపుణ్య ఉద్యోగుల హితాలను కాపాడుతూ, ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలుగు టెక్కీలకు ఇది పెద్ద కష్టంగా ఉంటుంది. గౌరవనీయ ప్రధాన మంత్రి గారికి మరియు విదేశాంగ మంత్రి శ్రీ @DrSJaishankar గారికి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నాను.” అని రాసుకొచ్చారు.

Medchal Wife Murder: కిరాతక మొగుడు కాలయముడయ్యాడు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

തമിഴ്‌നാട് ബി.ജെ.പിക്ക് മുമ്പില്‍ കീഴടങ്ങില്ല എന്ന് തെളിയിക്കാനുള്ള തെരഞ്ഞെടുപ്പ്; പോരാട്ടത്തിന് തുടക്കമിട്ട് ഉദയനിധി

കാഞ്ചീപുരം: ബി.ജെ.പിക്ക് മുമ്പില്‍ കീഴടങ്ങില്ല എന്ന് തെളിയിക്കാനും എ.ഐ.എ.ഡി.എം.കെ ജനറല്‍ സെക്രട്ടറി...

"எனக்கு கோவை வேறு கரூர் வேறு அல்ல; எனக்கு கோவையில் வாய்ப்பு தர காரணம்..!" – செந்தில் பாலாஜி

கோவை தெற்கு தொகுதியில் திமுக சார்பில் வேட்பாளராக அறிவிக்கப்பட்டுள்ளார் செந்தில் பாலாஜி....

RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!

రాజస్థాన్ రాయల్స్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. చెన్నై...

ಶಾಸಕರಿಗೆ 3 IPL ಟಿಕೆಟ್ ಕೊಡಲು ಕೆಎಸ್ ಸಿಎ ಒಪ್ಪಿಗೆ- ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು ,ಮಾರ್ಚ್,30,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಭಾರೀ ಚರ್ಚೆಗೆ ಗ್ರಾಸವಾಗಿರುವ  ಜನರಿಂದ...