31
March, 2026

A News 365Times Venture

31
Tuesday
March, 2026

A News 365Times Venture

Manipur: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై మెరుపు దాడి.. ఇద్దరు సైనికులు మృతి..

Date:

Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదులు అస్సాం రైఫిల్స్ సైనికులు ప్రయాణిస్తున్న ట్రక్కుపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారు. రాజధాని ఇంఫాల్ శివారులో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్ ఎయిర్ పోర్టు నుంచి 8 కి.మీ దూరంలో ఉనన నంబోల్ సబల్ లైకై ప్రాంతంలో, ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల వాహనంపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపినట్లు సైన్యం కూడా ధ్రువీకరించింది.

Read Also: Sleep Tourism: నయా ట్రెండ్.. స్లీప్ టూరిజంకు పోతారా.. !

దాడి తర్వాత ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడి జరిగిన ప్రాంతం ఇంఫాల్, చురాచంద్‌పూర్ మధ్యలో ఉంది. మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లా ఈ దాడిని ఖండించారు. విధి నిర్వహణలో మరణించిన సైనిక కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. ఇలాంటి హింసాత్మక ఘటనల్ని సహించబోమని ఆయన అన్నారు.

మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు, ఇది రాష్ట్రానికి “క్రూరమైన దెబ్బ” అని అన్నారు. ఘటన సమయంలో కాన్వాయ్‌లో మొత్తం 33 మంది సిబ్బంది ఉన్నారు. ఇద్దరు జవాన్లను కోల్పోవడం దారుణమైన దెబ్బగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం, ఈ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬಹುಭಾಷಾ ನಟ ಪ್ರಕಾಶ್‌ ರಾಜ್‌ ಗೆ ಮಾತೃ ವಿಯೋಗ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,30,2026 (www.justkannada.in):  ಬಹುಭಾಷಾ ನಟ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಅವರ ತಾಯಿ...

തെരഞ്ഞെടുപ്പ് പ്രചരണത്തിനിടെ ഭിന്നശേഷിക്കാരനായ പ്രവര്‍ത്തകനെ തല്ലി ഡി.സി.സി പ്രസിഡന്റ്

ഇടുക്കി: കുമളിയില്‍ നടന്ന യു.ഡി.എഫ് പരിപാടിയില്‍ ഭിന്നശേഷികാരനായ പാര്‍ട്ടി പ്രവര്‍ത്തകനെ മര്‍ദിച്ച്...

Gas Cylinder Scam : కొరత పేరుతో కుంభకోణం.. శ్మశానంలోనే సిలిండర్ సీక్రెట్.!

హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న భారీ దందాను...