జాతీయవాది చార్లీ కిర్క్ హత్య తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాంటీఫాను ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించారు. చార్లీ కిర్క్‌ను హత్య చేసిన నిందితుడు యాంటీఫాకు చెందిన వాడిగా ఎఫ్‌బీఐ అనుమానించింది. ఈ నేపథ్యంలో యాంటీఫాను తీవ్రవాద సంస్థగా ట్రంప్ పేర్కొన్నారు.

అయితే చార్లీ కిర్క్‌ను హత్య చేసిన నిందితుడు టైలర్ రాబిన్సన్‌కు యాంటీఫా ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లుగా స్పష్టమైన ఆధారాలు మాత్రం చూపించలేకపోయారు. రాబిన్సన్.. లింగమార్పిడి కలిగిన వ్యక్తితో కలిసి ఉంటున్నాడు. అయితే రాబిన్సన్‌కు యాంటీఫాతో సంబంధాలు ఉన్నట్లుగా ఎఫ్‌బీఐ భావిస్తోంది. ఆ కారణంతోనే యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లుగా తెలుస్తోంది.






