31
March, 2026

A News 365Times Venture

31
Tuesday
March, 2026

A News 365Times Venture

Hyderabad : రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ

Date:

Hyderabad : హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి బూమ్‌ రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జరగబోయే ప్రభుత్వ భూముల వేలం ఈ బూమ్‌కు నాంది పలకనుంది. వచ్చే నెలలో జరిగే ఈ-వేలంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశముందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వ్‌ ధరను ఎకరానికి ₹101 కోట్లుగా నిర్ణయించింది. అయితే ఈ ధర వేలంలో కనీసం ₹150 కోట్లకు చేరుతుందని, అంతకంటే ఎక్కువ పలికే అవకాశమూ ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Narendra Modi : ప్రధాని మోడీ 75వ పుట్టిన రోజు.. దేశవ్యాప్తంగా సేవా పక్వాడ

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్‌ 83/1లో ప్లాట్ నంబర్‌ 19లో 11 ఎకరాలు, ప్లాట్ నంబర్‌ 15A/2లో 7.67 ఎకరాలు కలిపి మొత్తం 18.67 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ కోసం రిజిస్ట్రేషన్ ఫీజును ₹1,180గా, బిడ్ డాక్యుమెంట్‌ ఫీజును ఒక్కో ప్లాట్‌కు ₹10 లక్షలుగా (GST అదనంగా) నిర్ణయించింది. బిడ్ దాఖలు చేసేందుకు గడువు అక్టోబర్‌ 1 సాయంత్రం 5 గంటల వరకు, ల్యాండ్ విజిటింగ్‌కి అక్టోబర్‌ 4 వరకు అవకాశం కల్పించారు.

వేలం అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ₹2,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవడానికి ఇది కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.

Telanagana : ప్రభుత్వాన్నే ఎదిరిస్తున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు.. దందా చేసి కోట్ల కొల్లగొట్టడమే లక్ష్యం

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಉಪಚುನಾವಣೆಗಳಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಗೆಲುವು ನಿಶ್ಚಿತ- ಮಾಜಿ ಸಿಎಂ ಬಿಎಸ್ ವೈ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,31,2026 (www.justkannada.in):  ದಾವಣಗೆರೆ ದಕ್ಷಿಣ ಮತ್ತು ಬಾಗಲಕೋಟೆ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ...

മഞ്ചേശ്വരത്ത് സ്ഥാനാര്‍ത്ഥിയെ നിര്‍ത്തിയത് എസ്.ഡി.പി.ഐയുടെ തന്ത്രം; വിമര്‍ശനം നടത്തിയത് തന്റെ വീഴ്ച; ഖേദം പ്രകടിപ്പിച്ച് തുളസീധരന്‍ പള്ളിക്കല്‍

കോഴിക്കോട്: മഞ്ചേശ്വരം മണ്ഡലത്തില്‍ എസ്.ഡി.പി.ഐ സ്ഥാനാര്‍ത്ഥിയെ നിര്‍ത്തിയത് ബി.ജെ.പിക്ക് സഹായകരമാകുമെന്ന പ്രസ്താവന...

`ஹார்முஸ் ஜலசந்தியை திறப்பதெல்லாம் இருக்கட்டும்; அதை விட…'- ஈரான் போரில் ட்ரம்ப்-ன் அடுத்த பிளான்?

ஈரான் போர் ஐந்தாவது வாரமாக நடந்து கொண்டிருக்கிறது. இது இந்தப் போரில்...

Trump-Bangladesh: మాకు రష్యా చమురు కొనుగోలుకు అనుమతివ్వండి.. ట్రంప్‌కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది....