1
April, 2026

A News 365Times Venture

1
Wednesday
April, 2026

A News 365Times Venture

Nepal: లగ్జరీ కార్లు.. విలాసవంతమైన భోగాలు.. వెలుగులోకి ప్రముఖుల పిల్లల చిత్రాలు

Date:

జెన్-జెడ్ ఉద్యమంతో నేపాల్ అల్లకల్లోలం అయింది. కనీవినీ ఎరుగని రీతిలో నేపాల్ రాజధాని ఖాట్మండు విధ్వంసానికి గురైంది. దేశంలో నాయకుల అవినీతి కారణంగా యువతలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. దీంతో జెన్-జెడ్ ఉద్యమం పేరుతో యువత చెలరేగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాధినేతల ఇళ్లు లక్ష్యంగా నిరసనకారులు చెలరేగిపోయారు. ధ్వంసం చేయడంతో పాటు ఆస్తులను తగలబెట్టేశారు. దీంతో ఆస్తులన్నీ మంటల్లో తగలబడిపోయాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దీంతో దేశ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది.

ఓ వైపు నేపాల్‌లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికంతో ప్రజలు విలవిలలాడుతుంటే ప్రముఖుల పిల్లలు మాత్రం లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. విదేశీ యాత్రలకు వెళ్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పేదోళ్లు రక్తం చిందించి.. చెమటోడ్చి పన్నలు కడుతుంటే.. ప్రముఖుల పిల్లలు మాత్రం సుఖభోగాలు అనుభవిస్తూ దర్జాగా బ్రతుకుతున్నారు. ఇదే యువతలో ఆగ్రహాన్ని రగిలించింది.

తాజాగా ప్రముఖల ఇళ్లల్లో ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లుగా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రుల పిల్లలు విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నట్లుగా కనిపించింది. డిజైనర్ బ్యాగులు, లగ్జరీ కార్లు, విదేశీ యాత్రలు, ఆడంబరమైన జీవనశైలికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవే నిరసనకారుల్లో అశాంతికి ఆజ్యం పోసింది. కడుపు మండిన ఆందోళనకారులు ప్రముఖుల ఇళ్లు లక్ష్యంగా విధ్వంసం సృష్టించారు. ఆస్తులన్నీ కాలి బుడిదయ్యాయి.

ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై జెన్-జెడ్ ఉద్యమం సోషల్ మీడియాలో ఉధృతంగా సాగుతోంది. అయితే కేపీ శర్మ ఓలి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. ఇది మరింత ఆగ్రహాన్ని రగిలించింది. అంతే ఉద్యమకారులంతా రోడ్డెక్కారు. దాదాపు 10 వేల మంది నిరసనకారులు ఒక్కసారిగా ఖాట్మండులో విధ్వంసం సృష్టించారు. మంత్రులను లక్ష్యంగా దాడులు చేశారు. దీంతో వణికిపోయిన ప్రభుత్వాధినేతలు పదవులకు రాజీనామా చేశారు. అలాగే ప్రధాని ఓలి కూడా రాజీనామా చేసి అదృశ్యమైపోయారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಸೆಸ್ಕ್ ವ್ಯವಸ್ಥಾಪಕ ನಿರ್ದೇಶಕ ಕೆ.ಎಂ. ಮುನಿಗೋಪಾಲ್ ರಾಜು ನಿವೃತ್ತಿ: ಆತ್ಮೀಯ ಬೀಳ್ಕೊಡುಗೆ

ಮೈಸೂರು, ಮಾರ್ಚ್, 31,2026 (www.justkannada.in):  ಚಾಮುಂಡೇಶ್ವರಿ ವಿದ್ಯುತ್ ಸರಬರಾಜು ನಿಗಮ...

യുവനടിയുടെ ലൈംഗികാതിക്രമ പരാതി; സംവിധായകന്‍ രഞ്ജിത്ത് അറസ്റ്റില്‍

  കൊച്ചി:യുവനടിയുടെ ലൈംഗികാതിക്രമ പരാതിയില്‍ സംവിധായകനും ചലച്ചിത്ര അക്കാദമി മുന്‍ ചെയര്‍മാനുമായ...

"ஊழலின் பேரரசு திமுக ஆட்சி; மத்திய அரசு கொடுத்த ஒரு‌ பைசாக் கூட.!" – பியூஷ் கோயல் குற்றச்சாட்டு

தமிழ்நாடு சட்டமன்றத் தேர்தல் நெருங்கிவிட்டது. இதையொட்டி இன்று கமலாலயத்தில் பாஜக...

PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

పంజాబ్ కింగ్స్ తమ ఐపీఎల్ 2026 క్యాంపెయిన్‌ను విక్టరీతో ప్రారంభించింది. ఆస్ట్రేలియా...