28
August, 2026

A News 365Times Venture

28
Friday
August, 2026

A News 365Times Venture

Khairatabad : గణేషున్ని చూడ్డానికి వెళితే.. 900 మంది పోకిరీలు అరెస్ట్..

Date:

Khairatabad : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేడుకల్లో మహిళలు, యువతులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నవారిపై షీ టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. కేవలం ఏడురోజుల వ్యవధిలోనే సుమారు 900 మంది పోకిరీలను షీ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద సంచలనంగా మారింది. షీ టీం దృష్టిలో పడిన వారిలో 55 మంది మైనర్లు కూడా ఉన్నారు. వీరిని కౌన్సెలింగ్‌కు హాజరుపరచగా, పెద్దవారి విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కొంతమందిని కోర్టులో హాజరు పరచే విధంగా కేసులు నమోదు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే తప్పించుకోవచ్చని భావించిన పోకిరీలకు షీ టీం షాక్ ఇచ్చింది. గణేష్ మండపాల వద్ద, నిమజ్జనం ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పదంగా ప్రవర్తించే వారిని గుర్తించి పట్టుకున్నారు.

PM Modi: ట్యాక్స్‌లతో చిన్న పిల్లలను వదలని కాంగ్రెస్.. జీఎస్టీ సవరణలపై మోడీ

షీ టీం ఇన్‌చార్జి లావణ్య మాట్లాడుతూ, “మహిళలు, యువతులపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిమజ్జనం పూర్తయ్యే వరకు మా టీంలు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తాయి. మహిళలు ఎలాంటి భయం లేకుండా వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి” అని సూచించారు. ఉత్సవ వాతావరణంలో సురక్షిత వాతావరణం కల్పించడం తమ బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం నిరంతర నిఘా కొనసాగుతుందని, ఇలాంటి చర్యల వల్ల పోకిరీలు వెనకడుగు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

K. A. Paul : నేను రింగులోకి వస్తే అందరి సంగతులు తేలుస్తా

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വിശ്വാസികൾക്ക് എത്രത്തോളം വേദനയുണ്ടാക്കും ; സണ്ണി എം. കപിക്കാട് മാപ്പ് പറയണം – അബ്ദുള്ള ബാസിൽ

ജാതീയതയുടെ പേരിലുള്ള ഒരുപാട് പീഡനങ്ങൾ അനുഭവിച്ചവരാണ് ദളിതർ. അവരുടെ ആശയപ്രചാരണത്തിനും അഭിപ്രായസ്വാതന്ത്ര്യത്തിനും...

`நிதியமைச்சர் மரியவில்சன் இங்கிலாந்தின் அரசரா?’ – அடிதடி வழக்கில் நீதிமன்றம் கடுகடுத்த பின்னணி!

தமிழக சட்டமன்றத் தேர்தலில் தமிழக வெற்றிக் கழகம் சார்பில் ஆர்.கே.நகர் தொகுதியில்...

OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!

OTR: కొడితే కొట్టాలిరా…. సిక్స్‌ కొట్టాలి అంటూ కొత్తగా సాంగులు సింగుతున్నారట...

ಕಾಮಗಾರಿ ಅಪೂರ್ಣ, ಬಳಕೆಗೆ ಬಾರದ ಸ್ಥಿತಿ:  “ಸೈನಿಕ” ಉದ್ಯಾನವನಕ್ಕೆ ಗ್ರಹಣವೇ?

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,27,2026 (www.justkannada.in): ನಗರದ ದಟ್ಟಗಳ್ಳಿ 3ನೇ ಹಂತದಲ್ಲಿ, ಮಹಾಲಕ್ಷ್ಮಿ ದೇವಸ್ಥಾನದ...