15
March, 2026

A News 365Times Venture

15
Sunday
March, 2026

A News 365Times Venture

Tollywood : తెలుగులో సినిమాలు ఎందుకు చేయట్లేదో చెప్పేసిన యంగ్ బ్యూటీ

Date:

టాలీవుడ్‌లో కేరళ ముద్దుగుమ్మలు అంటే ఎప్పుడూ క్రేజే . అందకే అందం అభినయం ఉన్న అమ్మాయిను భాష రాకపోయినా కేరళ కుట్టీలకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు టాలీవుడ్‌ మూవీ మేకర్స్‌. స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత కూడా మలయాళం నుండి వచ్చిన బ్యూటీనే. మాలీవుడ్ నుండి వచ్చి ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చలామణి అవుతుంటే కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం దీనికి భిన్నంగా డబ్బింగ్‌ చిత్రాలతోనే పలకరిస్తోంది. స్ట్రెయిట్‌ మూవీస్‌ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపించలేదు.

Also Read : Sandile Wood : మరో డిఫ్రెంట్ సినిమాతో ఆడియెన్స్ ను ఆశ్యర్యపరచబోతున్న వర్శటైల్ యాక్టర్

అఖిల్‌తో ‘హలో’లో పలకరించిన ఈ భామ ఆతర్వాత చిత్రలహరి, రణరంగం లాంటి మూవీస్‌ చేసినా సరైన సక్సెస్‌ రాలేదు. ఆరంభం పర్వాలేదు అనిపించినా హ్యాట్రిక్ హిట్ మిస్ అవడంతో ట్రాక్ మారిపోయింది. ప్రజెంట్‌ కళ్యాణి తమిళ, మలయాల చిత్రాలపై చూపించే శ్రద్ధ తెలుగు సినిమాలపై చూపించట్లేదు. అవకాశాలు వచ్చిన కూడా చేయడం లేదని టాక్ కూడా వినిపించింది. ఈ వ్యాఖ్యలకు తాజాగా కళ్యాణి ప్రియదర్శిని సమాధానం ఇచ్చింది. కొత్త లోక సక్సెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ “నాకు ప్రేమ చూపించిన మొదటి ప్రేక్షకులు తెలుగువారే. అది నేను ఎప్పటికీ మరచిపోను. ఇన్నిరోజులు తరువాత మళ్ళీ మిమ్మల్ని కలవడం, మీ ప్రేమ పొందడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. సరైన కథలు వస్తే నాకు తెలుగులో చాలా సినిమాలు చేయాలని ఉంది. కొత్తలోక సినిమాని తెలుగు సినిమాలా భావించి ఆదరిస్తున్నారు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమే మాకు బలం. మీ మద్దతుతో ఇలాంటి గొప్ప సినిమాలు మరిన్ని వస్తాయి. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పెద్ద థాంక్యూ. కథ నచ్చితే కన్ఫార్మ్ గా సినిమా చేస్తాను’ అని అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പൂനെയില്‍ പൊതുസ്ഥലത്ത് നോമ്പ് തുറക്കുന്നത് ചോദ്യം ചെയ്ത് യുവാക്കളെ ആക്രമിച്ചു; അഞ്ച് പേര്‍ക്ക് പരിക്ക്; 15 പേര്‍ പിടിയില്‍

പൂനെ: പൂനെ അക്‌സര്‍വാഡിയില്‍ കുളത്തിനരികെ നോമ്പ് തുറയ്ക്കായി ഒത്തുകൂടിയ മുസ്‌ലിം യുവാക്കളെ...

“உளவுத் துறையைக் கையாளப் போகும் முதல் பெண் டி.ஜி.பி”- அதிரடி மாற்றங்களைக் கையில் எடுத்த அரசு!

தமிழகத்தில் கடந்த சில நாட்களாக நடந்துவந்த குற்றசெயல்களும், அதை தொடர்ந்து...

Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

కాలేయం మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవం. ఇది విషతుల్యాలను తొలగించడం,...