10
March, 2026

A News 365Times Venture

10
Tuesday
March, 2026

A News 365Times Venture

Drug Racket: పేరుకే సెక్యూరిటీ గార్డులు.. చేసేది మాత్రం గలీజ్ దందా! స్టూడెంట్స్‌ను టార్గెట్ చేసి

Date:

అదనపు ఆదాయం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. చిన్న చితకా ఉద్యోగాలు చేసే వారికి అయితే అదనపు ఆదాయం చాలా అవసరం ఉంటుంది. తద్వారా ఆర్ధికంగా బలపడదామని భావిస్తారు. కానీ కొంత మంది మాత్రం అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సరిగ్గా ఇదే రీతిలో ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డులు ఏకంగా గంజాయి వ్యాపారం షురూ చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.

బీహార్‌కు చెందిన అర్జున్ కుమార్ అనే వ్యక్తి ఎడన్ బాగ్‌లో నివాసం ఉంటున్నాడు. అమృత కపాడియా నవజీవన్ ఉమెన్స్ కాలేజీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అదే బీహార్‌కు చెందిన రాహుల్ పండరి అనే వ్యక్తి మరోచోట సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. ఒకే రాష్ట్రం కావడంతో స్నేహం కుదిరింది. ఇద్దరికీ సెక్యూరిటీ గార్డు డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దీంతో అదనపు ఆదాయం కోసం గంజాయి అమ్మాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా గంజాయి తీసుకు వచ్చి హైదరాబాద్లోని పలు కాలేజీల్లో విద్యార్థులకు అమ్మడం స్టార్ట్ చేశారు.

ఐతే ఆ నోటా ఈ నోటా.. వీళ్ల ఇద్దరి గంజాయి వ్యాపారం కాస్తా పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాహుల్ పండరి వద్ద గంజాయి ఉందనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. కానీ అదే సమయంలో తన వద్ద ఉన్న గంజాయిని అర్జున్ కుమార్ వద్ద నిల్వ చేసి బీహార్‌కు పారిపోయాడు రాహుల్. కానీ పోలీసులు రాగానే వారికి గంజాయితో సహా అర్జున్ కుమార్ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 7.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితున్ని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಎರಡು ಹಂತದಲ್ಲಿ ಜನಗಣತಿ-2027:  ಜಿಲ್ಲಾಡಳಿತದಿಂದ ಸಕಲ ಸಿದ್ಧತೆ

ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ, ಮಾರ್ಚ್,9,2026 (www.justkannada.in): ಜನಗಣತಿ-2027 ಭಾರತದ 16ನೇ ಜನಗಣತಿ...

ഹോളി ആശംസിച്ചു; യു.പിയില്‍ ദളിത് യുവാവിനെ കുത്തിക്കൊന്ന് ബ്രാഹ്‌മണ കുടുംബം

ലഖ്നൗ: ഉത്തര്‍പ്രദേശില്‍ ദളിത് യുവാവിനെ കുത്തിക്കൊലപ്പെടുത്തി ബ്രാഹ്‌മണ കുടുംബം. ഉയര്‍ന്ന ജാതിക്കാരായ...

“டெல்லிக்கு அழைத்த சி.பி.ஐ… பனையூரில் முகாமிடும் விஜய்” – பின்னணி என்ன?

தேசிய ஜனநாயக கூட்டணிக்குள் த.வெ.க-வை இணைக்க கடுமையான முயற்சிகள் நடப்பதாக ஒருபுறம்...

CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

CM Revanth Reddy : హైడ్రా పునరుద్దరించిన నల్ల చెరువుకు గంగా...