5
March, 2026

A News 365Times Venture

5
Thursday
March, 2026

A News 365Times Venture

Fire Break : యాదాద్రి భువనగిరిలో రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

Date:

Fire Break : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామంలో ఉన్న SR ల్యాబ్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కొద్ది సేపట్లోనే పెద్ద ఎత్తున దగ్ధమయ్యాయి. పరిశ్రమ అంతటా మంటలు వ్యాపించడంతో ఉద్యోగులు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. మంటలు ఎగసిపడుతున్న సమాచారంతో ఫైర్ సిబ్బంది తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపన చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Shocking murder: సహస్ర ఇంటిలోకి మైనర్ కిల్లర్ ఎందుకు వెళ్లాడు?

ఇక పరిశ్రమలోని రసాయనాలు కారణంగా మంటలు మరింత తీవ్రరూపం దాల్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అయితే ఆస్తి నష్టం పెద్దఎత్తున జరిగే అవకాశముందని అంచనా. ప్రమాదానికి గల కారణం స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక రసాయనాల అవాంఛిత రియాక్షనా? అనేది తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభమైంది. స్థానికులు ఆందోళన చెందుతుండగా, పోలీసులు పరిశ్రమ వద్ద మోహరించి పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు.

Sahasra murder case: అసలు సహస్ర హత్య కేసులో ఏం జరిగింది?..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬೆಂಗಳೂರು ಸೇರಿ ರಾಜ್ಯದ ಹಲವೆಡೆ ಲೋಕಾಯುಕ್ತ ದಾಳಿ, ಪರಿಶೀಲನೆ

ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್​, 5,2026 (www.justkannada.in):  ಬೆಳ್ಳಂಬೆಳಿಗ್ಗೆ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಲೋಕಾಯುಕ್ತ ಅಧಿಕಾರಿಗಳು...

ഇസ്രഈലിന്റെ പാവയായ ട്രംപിൽ നിന്നും അമേരിക്കയെ തിരിച്ചുപിടിക്കാൻ ആഹ്വാനം ചെയ്ത് ഇറാഖ് നേതാവ്

ബാഗ്‌ദാദ്‌: ഇസ്രഈലിന്റെ കയ്യിലെ പാവയായ അമേരിക്കൻ പ്രസിഡന്റ് ഡൊണാൾഡ് ട്രംപിൽ നിന്നും...

“ஃபினிஷ்' அந்த கை சைகையை நான் திட்டமிட்டு செய்யவில்லை.!' – முதல்வர் ஸ்டாலின் விளக்கம்

திமுக - காங்கிரஸ் கூட்டணியின் தொகுதி பங்கீடு ஒப்பந்தத்தை நேற்று (மார்ச்.5)...

Sonu Sood: రంగంలోకి హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయిన...