14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

Indigo Flight: తిరుపతిలో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

Date:

Indigo Flight: తిరుపతి విమానాశ్రయంలో శనివారం ఇండిగో విమానానికి ప్రాణాపాయ పరిస్థితి తృటిలో తప్పింది. సాంకేతిక లోపం కారణంగా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్యలు తలెత్తాయి. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి, విమానాన్ని 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించి, చివరికి తిరుపతిలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు.

అయితే విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయకపోవడంతో వారు విమానాశ్రయంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను ప్రశ్నిస్తూ, తమ గమ్యస్థానానికి వెళ్లే ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా విమానయాన సంస్థలు మరియు పైలట్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. చిన్న సాంకేతిక లోపం కనిపించినా, ప్రయాణికుల భద్రత కోసం పైలట్లు విమానాలను టేకాఫ్ తర్వాత తిరిగి విమానాశ్రయానికి తీసుకువస్తున్నారు.

కేవలం తిరుపతి ఘటన మాత్రమే కాదు, ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. థాయిలాండ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై టేకాఫ్‌ను రద్దు చేశారు. ప్రయాణికుల భద్రత కోసం విమానాన్ని హైదరాబాద్‌లోనే నిలిపివేసి, సాంకేతిక సిబ్బంది సమస్య పరిష్కరించే వరకు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ తరహా సంఘటనలు ప్రయాణికులలో ఆందోళనను పెంచుతున్నాయి. అయితే విమానయాన నిపుణులు మాత్రం, “భద్రతే ప్రథమ ప్రాధాన్యత” అని చెబుతున్నారు. చిన్న లోపం కనిపించినా అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే పెద్ద ప్రమాదాలు నివారించబడుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

CoinDCX: క్రిప్టో ప్లాట్‌ఫామ్ CoinDCX హ్యాక్.. రూ. 368 కోట్ల నష్టం..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.എസ് -ഇസ്രഈല്‍ ആക്രമണത്തില്‍ മൊജ്തബ ഖാംനഇക്ക് സാരമായി പരിക്കേറ്റു; അവകാശവാദവുമായി യു.എസ് പ്രതിരോധ സെക്രട്ടറി

വാഷിങ്ടണ്‍: ഇറാന്റെ പുതിയ പരമോന്നത നേതാവ് മൊജ്തബ ഖാംനഇക്ക് യു.എസ് -ഇസ്രഈല്‍ ആക്രമണത്തില്‍...

"நடிகர் ரஜினிகாந்தை யாரும் மிரட்ட முடியாது; எந்த மிரட்டலுக்கும் அவர் அடிபணிய மாட்டார்!" – ரகுபதி

புதுக்கோட்டையில் செய்தியாளர்களை சந்தித்த அமைச்சர் ரகுபதி,"நடிகர் ரஜினிகாந்தை யாரும் மிரட்ட முடியாது....

Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

క్రికెట్ ప్రపంచంలో ‘దేవుడు’గా పిలవబడే సచిన్ టెండూల్కర్ పేరు వినగానే పరుగుల...