12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

Raja Singh: కొత్త అధ్యక్షుడిపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

Date:

కొత్త అధ్యక్షుడిని డమ్మీ డమ్మీ అని అందరన్నారని.. తాను డమ్మిని కాదు మమ్మీకి డాడీని అన్న రామ్ చందర్ రావుకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానన ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డమ్మీ కాదని నిరూపించుకునేందుకు రామ్ చందర్ రావుకు ఇది మంచి అవకాశమన్నారు. ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని.. లీగల్ టీమ్ తో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసీ ఫాతిమా కాలేజ్ కూల్చేందుకు కొట్లాడాలని తెలిపారు. హైడ్రా వల్ల అనేక పేద కుటుంబాలు రోడ్ల పాలయ్యాయని.. పేదలకు ఒక న్యాయం, ఫాతిమా కాలేజ్ కు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. రంగనాథ్ కు ఫాతిమా కాలేజ్ కూల్చడానికి ధైర్యం చాలడం లేదా? అని నిలదీశారు.

READ MORE: Hyderabad Bomb Threat: హైదరాబాద్‌లో ముగిసిన తనిఖీలు.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు!

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షపదవికి నామినేషన్‌ వెయ్యనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను పూర్వ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించినట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన అన్నారు. నావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు.

READ MORE: Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ.. సీఎం ఏం చెప్పారంటే..?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಶಾಸಕ ಭೈರತಿ ಬಸವರಾಜುಗೆ ಷರತ್ತುಬದ್ಧ ಜಾಮೀನು ಮಂಜೂರು

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,12,2026 (www.justkannada.in): ರೌಡಿಶೀಟರ್ ಬಿಕ್ಲು ಶಿವ ಕೊಲೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಬಿಜೆಪಿ...

മിനാബിലെ പ്രൈമറി സ്‌കൂളിൽ നടന്ന ആക്രമണം മാപ്പർഹിക്കാത്ത യുദ്ധക്കുറ്റം; ഉത്തരവാദികൾ ശിക്ഷിക്കപ്പെടാതെ പോകില്ല: ഇറാൻ

ഇസ്താംബുൾ: ഇറാനിലെ മിനാബിൽ പെൺകുട്ടികളുടെ സ്കൂളിന് നേരെ അമേരിക്കയും ഇസ്രഈലും നടത്തിയ...

'தேமுதிகவுக்காக எதுக்கு தியாகம் பண்ணணும்?' – எரிச்சலில் கூட்டணி கட்சிகள்; அறிவாலயத்தின் ப்ளான் என்ன?

கூட்டணி கட்சிகளிடம், தொகுதிகளை குறைத்துக் கொள்ள சொல்லி வலியறுத்திக் கொண்டிருக்கிறது அறிவாலயம்....

LPG crisis: ఎల్‌పీజీ సంక్షోభం.. తగ్గిన స్విగ్గీ, జొమాటో డెలివరీలు..

LPG crisis: మిడిల్ ఈస్ట్ యుద్ధం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి....