13
March, 2026

A News 365Times Venture

13
Friday
March, 2026

A News 365Times Venture

Off The Record: నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎందుకంత క్రేజ్‌..?

Date:

Off The Record: నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి యమా డిమాండ్‌ ఏర్పడింది. త్వరలోనే… స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న క్రమంలో… డీసీసీ అధ్యక్షులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందట ఏఐసీసీ. అదే జరిగితే… రేపటి రోజున టిక్కెట్ల కేటాయింపుల కీలక పాత్ర ఉంటుందిగనుక… ఆ పోస్ట్‌కు యమా క్రేజ్‌ ఏర్పడిందట. అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి ఉంటుంది కదా…. ఇక్కడ మాత్రమే ఎందుకలా అంటే… మా జిల్లా కాస్త ప్రత్యేకం అంటున్నారట స్థానిక కాంగ్రెస్‌ నాయకులు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కార్పొరేషన్ పదవుల మీద సీరియస్‌గా ద్రుష్టి పెట్టిన నల్లగొండ నేతలు… తాజాగా రూట్ మార్చి….. డిసిసి పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారట. అంతేకాదండోయ్‌… ఇటీవలే కాంగ్రెస్‌ అధిష్టానం పలువురికి రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు కట్టబెట్టింది. ఇక్కడి నాయకులు కొందరికి ఆ ఆఫర్‌ ఇచ్చినా… వద్దనుకుని మరీ, డీసీసీ రేస్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Dowry Harassment: వరకట్న వేధింపులు.. పెళ్ళైన రెండు నెలలకే ఘోరం..!

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం ఆశావహుల ప్రయత్నాలు ఒక ఎత్తయితే… మా వాళ్ళకే ఇప్పించుకోవాలంటూ…. సీనియర్స్‌ చేస్తున్న ప్రయత్నాలు మేటర్‌ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. వ్యూహ ప్రతి వ్యూహాలతో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది. సీనియర్ నేత జానారెడ్డి అనుంగు శిష్యుడిగా ముద్ర ఉన్న శంకర్ నాయక్ రెండు సార్లు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో… పోస్ట్‌ ఖాళీ అయింది. ఈ క్రమంలో డీసీసీ పీఠం దక్కాలంటే సీనియర్ నేతల ఆశీస్సులు ఉండాల్సిందేనని, అంతకు మించి రాజకీయాల్లో ఎదగాలంటే అందరివాడిని అనిపించుకొవాలని, అందుకు డీసీసీనే సరైన పోస్ట్‌ అని భావిస్తున్నారట ఎక్కువ మంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక అనుచరుడిగా ఉన్న గుమ్మల మోహన్ రెడ్డి.. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని తిరస్కరించారు. తనకు జిల్లా అధ్యక్ష పదవి మాత్రమే కావాలని బహిరంగంగానే చెబుతున్నారాయన. ఆయనకు పలువురు నేతలు మద్దతు ప్రకటించడం కొసమెరుపు. అటు డీసీసీ అశిస్తున్న జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్యకు కూడా ఉపాద్యక్ష పదవి వద్దని.. డీసీసీ పీఠం వైపే మొగ్గుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు డీసీసీ ఇవ్వాలని పట్టుబడుతున్నారట ఆయన. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన జాల నరసింహారెడ్డి, మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీసీ నేత పున్నా కైలాష్‌ కూడా డీసీసీ రేస్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ పదవిపై పెద్దగా ఆసక్తి చూపని నేతలు… ఇప్పుడు రూట్ మార్చి… ఓ రేంజ్‌లో పైరవీలు మొదలు పెట్టడం వెనక పెద్ద కథే ఉందని అంటున్నారు సొంత పార్టీ నేతలు..

Read Also: Triple Murders: హైదరాబాద్‌లో వరుస హత్యలు.. ఈ హత్యల్లో మిస్టరీ ఏంటి..?

రాబోయేది స్థానిక ఎన్నికల కాలం. పార్టీ బీ ఫామ్స్‌ అన్ని డీసీసీ అధ్యక్షుడి చేతుల మీదుగా పంపిణీ అయ్యే అవకాశం ఉండటం వల్లే ఈ క్రేజ్ అన్నది విస్తృతాభిప్రాయం. పీఠాన్ని దక్కించుకునేందుకు కొందరు తమ నేతను దాటి… మరో సీనియర్ నేత ఆశీస్సుల కోసం వెళ్తుండటంతో సీనియర్స్‌ మధ్య ఆధిపత్యపోరుకు తెరలేచే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు వరుసగా రెండు సార్లు డీసీసీ పీఠం ఎస్టీలకే దక్కడంతో ఈసారి ఆ లెక్కమారాల్సిందేనని పట్టుబడుతున్నారట పలువురు నేతలు. ఈ విడత ఓసీలకే ఇవ్వాలని కొందరు… బీసీ, ఎస్సీలకు అసలు అవకాశమే ఇవ్వారా అని మరి కొందరు పార్టీ పెద్దలను నేతలు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్దితుల్లో డీసీసీ పీఠంపై కూర్చుంటే చాలా లాభాలుంటాయని భావిస్తున్నారట ఎక్కువ మంది. అందుకే…. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత జానారెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ….. వత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. దీంతో ఆ నేతల ఎత్తుగడలు జిల్లా సీనియర్ నేతలకు తలనొప్పిగా మారుతున్నాయట. అంతేకాదు… తమ అనుచరుడికే డీసీసీ పీఠం ఇప్పించుకోవాలన్న పట్టుదల సీనియర్స్‌లో పెరిగేంతలా వాళ్ళని ప్రభావితం చేస్తున్నారట. దీంతో డీసీసీ పీఠం ఎవరికి దక్కుతుంది… జిల్లా సీనియర్ నేతలు ఎవరివైపు మొగ్గు చూపుతారు… క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏవిధంగా ఉంటాయన్న ఆసక్తి పెరుగుతోంది. అలాగే మంత్రి కోమటిరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిల్లో ఎవరి పంతం నెగ్గుతుంది.. ఎవరికి అనుచరుడికి ఆ అదృష్టం ఎవరిస్తుందంటూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನನ್ನನ್ನು ಬೆಳೆಸಿದಂತೆ ಯತೀಂದ್ರರನ್ನು ರಾಜಕೀಯವಾಗಿ ಬೆಳೆಸಿ-ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್13,2026 (www.justkannada.in):  ರಾಜಕೀಯವಾಗಿ ನನ್ನನ್ನು ಬೆಳೆಸಿದಂತೆ ಪುತ್ರ ಯತೀಂದ್ರರನ್ನು ಬೆಳೆಸುವಂತೆ...

കടന്നുവന്ന കനല്‍വഴികള്‍ മറ്റുള്ളവര്‍ മറന്നാലും ഞാന്‍ മറക്കില്ല; എന്റെ ചോരവീണ മണ്ണില്‍ തലയുയര്‍ത്തിത്തന്നെ നില്‍ക്കും: കെ. സുധാകരന്‍

കണ്ണൂര്‍: നിയമസഭാ സ്ഥാനാര്‍ത്ഥി നിര്‍ണയത്തിലെ അതൃപ്തി പരസ്യമാക്കി കോണ്‍ഗ്രസ് നേതാവ് കെ.സുധാകരന്‍....

பண்ணையாளர்கள் அறிமுகப்படுத்திய பரிசுகள்… வளைக்கப்பட்ட வாக்காளர்கள்! | நினைவுச் சுவடுகள் 09

பரிசுகளால் வளைக்கப்பட்ட வாக்காளர்கள்நினைவுச் சுவடுகள்தமிழ்நாட்டு அரசியலில் தேர்தல்கள் என்றால் பொதுக்கூட்டம், மாநாடு,...

Heroes Body Transformation: సినిమాల కోసం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. యంగ్ హీరోల సరికొత్త లుక్స్ వైరల్..!

Heroes Body Transformation: ప్రస్తుతం టాలీవుడ్‌లో మేకోవర్ సీజన్ నడుస్తోంది. కొత్త...