11
March, 2026

A News 365Times Venture

11
Wednesday
March, 2026

A News 365Times Venture

Pakistani Minister: దంగల్ సినిమాను బ్యాన్ చేసి తప్పు చేశా..

Date:

Pakistani Minister: ఇండియన్ సినీ హిస్టరీలో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీల్లో ‘దంగల్’ ఒకటి. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక, పాకిస్తాన్‌లో మాత్రం ఈ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ఈ విషయంపై పాక్ మాజీ సమాచార శాఖ మంత్రి, ప్రస్తుత పంజాబ్ ప్రావిన్స్ సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబు స్పందించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో ‘దంగల్’ సినిమా విడుదలైంది, ఆ సమయంలోనే అధికారులు ఈ సినిమాపై నిషేధానికి సిఫారసు చేశారని తెలిపారు. ఆ మూవీని నేను చూడకుండానే నిషేధానికి ఒప్పుకున్నాను.. అది నా రాజకీయ జీవితంలో చేసిన ఒక పెద్ద తప్పు అని ఆమె అంగీకరించింది.

Read Also: IND vs AUS: నాలుగు నెలల సమయం ఉన్నా.. హాట్‌కేకుల్లా మ్యాచ్‌ టికెట్లు! ఒక్కడే 880 టిక్కెట్లు

ఇక, 18 నెలల తర్వాత ‘దంగల్’ సినిమాను చూసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని మాజీ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబు పేర్కొన్నారు. ఈ మూవీ బాలికలకు ఎంతో స్ఫూర్తినిచ్చే కథ.. అలాంటి సినిమాను నిషేధించడం నిజంగా నన్ను తీవ్రంగా కలచివేసిందని విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటుడు అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ సెన్సార్ బోర్డు కొన్ని షరతులతో సినిమాను ఆమోదించాలని చెప్పింది.. భారత జాతీయ గీతం వినిపించే దృశ్యాన్ని, జాతీయ పతాకం కనిపించే భాగాన్ని తీసేయాలని వాళ్లు చెప్పారని గుర్తు చేశారు. అయితే, నా దేశ గౌరవానికి విరుద్ధంగా ఎలాంటి మార్పులు చేసేందుకు నేను ఒప్పుకోలేదని వెల్లడించారు. నా నిర్ణయంతో సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడినా సరే, దేశం మీద ప్రేమ తగ్గొద్దని అమీర్ ఖాన్ స్పష్టంగా తెలిపారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ ನಾಳಿನ ಮೈಸೂರು ಪ್ರವಾಸ ರದ್ದು

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,11,2026 (www.justkannada.in): ನಾಳೆ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದ  ಮೈಸೂರು ಪ್ರವಾಸವನ್ನು...

എന്തുകൊണ്ട് കേരളത്തിന് എയിംസ് അനുവദിക്കുന്നില്ല? കേന്ദ്രത്തിനെതിരെ ഹൈക്കോടതിയുടെ രൂക്ഷ വിമർശനം

കൊച്ചി : കേരളത്തിന് എയിംസ് അനുവദിക്കാത്തതിൽ കേന്ദ്രത്തിനെതിരെ രൂക്ഷ വിമർശനവുമായി ഹൈക്കോടതി...

இந்தியா வந்துகொண்டிருந்த சரக்குக் கப்பல் மீது தாக்குதல்: ஹார்முஸ் ஜலசந்தியில் ஈரான் போரால் பதற்றம்!

ஈரான் மீது இஸ்ரேலும், அமெரிக்காவும் இணைந்து போர் தொடுத்த நிலையில், மத்திய...

Afghanistan: ఇవేం బుద్ది తక్కువ పనుల్రా బాబు.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల విద్యపై శాశ్వత నిషేధం!

ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, దేశ విద్యాశాఖ మంత్రి ఇటీవల...