12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

Pawan Kalyan: మధురై చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. పంచెకట్టులో..!

Date:

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తమిళనాడులో పర్యటించనున్న విషయం తెలిసిందే. మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు కాసేపటి క్రితం ప్రత్యేక విమానంలో మధురై చేరుకున్నారు. మధురై విమానాశ్రయంలో పవన్‌కి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం.. అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడులో ముఖ్య అతిథిగా పవన్‌ పాల్గొంటారు.

Also Read: Eluru-SAI: మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. నిజమే అని తేల్చిన అధికారులు!

పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి మధురై వెళ్లాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. మధ్యాహ్నం 12.30 మధురై చేరుకోవాల్సిన పవన్‌.. గంట ఆలస్యంగా వెళ్లారు. ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్‌కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ సంప్రదాయ దుస్తులు ధరించారు. పంచెకట్టులో పవన్ మధురై చేరుకున్నారు.

Pawan Kalyan2

Pawan Kalyan1

Pawan Kalyan

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಸಮಸ್ಯೆ: ಕೇಂದ್ರದ ವಿರುದ್ದ ಗುಡುಗಿದ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,12,2026 (www.justkannada.in): ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಪೂರೈಕೆಯಾಗದೆ...

ഇറാനെ ആക്രമിക്കാനായി ഇറാഖിനെ താവളമാക്കാന്‍ ആരെയും അനുവദിക്കില്ല: ഇറാഖ് പ്രധാനമന്ത്രി

ബാഗ്ദാദ്: ഇറാനെതിരായ ആക്രമണങ്ങള്‍ക്ക് യു.എസ് ഇറാഖിന്റെ വ്യോമാതിര്‍ത്തിയടക്കം ഉപയോഗിക്കുന്നതിനെ എതിര്‍ത്ത് ഇറാഖ്...

Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Supreme Court: 10 మంది పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు...