12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

Leopard: విషాదం.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత..

Date:

Leopard: తమిళనాడులో పెను విషాద ఘటన చోటుచేసుకుంది.. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగు సంవత్సరాల బాలిక రోషిణిని చిరుతపులి లాక్కెళ్లి దాడి చేసింది‌… కోయంబత్తూర్ సమీపంలోని వాల్పరైలోని టీ ఎస్టేట్‌లో తల్లిదండ్రులు టీ ఎస్టేట్‌లో పనిచేస్తుండగా బాలికపై చిరుత దాడి చేసింది. గంటల తరబడి గాలింపు చర్యలు తరువాత అటవీ ప్రాంతంలో బాలిక శరీర భాగాలను గుర్తించారు పోలీసులు.. అప్పటికే చిరుత పులి బాలికను సగం తిన్నట్లుగా పోలీసులు వెల్లడించారు..

Read Also: Rishabh Pant: సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్‌.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్‌!

కోయంబత్తూర్ సమీపంలోని వాల్పరైలోని టీ ఎస్టేట్‌లో తల్లిదండ్రులు టీ ఎస్టేట్‌లో పని చేసుకుంటున్నారు. తమ నాలుగేళ్ల చిన్నారిని ఇంటి ముందు ఆడుకోమని చెప్పి.. అక్కడికి కొద్ది దూరంలోనే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో రాకాసి చిరుత.. పాపం.. ఆడుకుంటున్న చిన్నారి రోషిణిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా.. ఆ చిన్నారితో తన నోటితో కరుచుకొని.. అడవుల్లోకి లాక్కెళ్లింది. నాలుగు సంవత్సరాల బాలికను చిరుతపులి లాక్కెళ్లిన ఘటన సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కోయంబత్తూర్‌లోని వాల్పరై పట్టణానికి సమీపంలోని పచ్చమలై ఎస్టేట్‌లోని సౌత్ డివిజన్‌లో చోటు చేసుకుంది.

Read Also: Kingdom : అయోమయంలో కింగ్ డమ్.. ఏ డేట్ కు వస్తాడో..?

చిన్నారి రోషిణి, జార్ఖండ్‌కు చెందిన టీ ఎస్టేట్ కార్మికుడు మనోజ్ కుండ్ కుమార్తె. ఆమె ఇంటి ముందు ఆడుకుంటుండగా సమీపంలోని టీ తోట నుండి ఒక చిరుతపులి వచ్చి ఆమెపై దాడి చేసి, ఆమెను లాక్కెళ్లింది. ఈ సంఘటనను గమనించిన ఎస్టేట్ కార్మికులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ బిడ్డ ఆచూకీ లభించలేదు. దీంతో రోష్ని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టీ ఎస్టేట్‌లో పనిచేసేందుకు పాపం వారు గత ఆదివారమే పని కోసం జార్ఖండ్ నుండి వాల్పరైకి వచ్చారు. ఇంతలో తమ చిన్నారికి ఇలా జరిగింది. చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లిన పులి.. ఆమెను ఏం చేసి ఉంటుందో అని అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో విషాద వార్త వినాల్సి వచ్చింది… అటవీ ప్రాంతం సమీపంలో చిన్నారి శరీర భాగాలను గుర్తించారు పోలీసులు.. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಶಾಸಕ ಭೈರತಿ ಬಸವರಾಜುಗೆ ಷರತ್ತುಬದ್ಧ ಜಾಮೀನು ಮಂಜೂರು

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,12,2026 (www.justkannada.in): ರೌಡಿಶೀಟರ್ ಬಿಕ್ಲು ಶಿವ ಕೊಲೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಬಿಜೆಪಿ...

മിനാബിലെ പ്രൈമറി സ്‌കൂളിൽ നടന്ന ആക്രമണം മാപ്പർഹിക്കാത്ത യുദ്ധക്കുറ്റം; ഉത്തരവാദികൾ ശിക്ഷിക്കപ്പെടാതെ പോകില്ല: ഇറാൻ

ഇസ്താംബുൾ: ഇറാനിലെ മിനാബിൽ പെൺകുട്ടികളുടെ സ്കൂളിന് നേരെ അമേരിക്കയും ഇസ്രഈലും നടത്തിയ...

'தேமுதிகவுக்காக எதுக்கு தியாகம் பண்ணணும்?' – எரிச்சலில் கூட்டணி கட்சிகள்; அறிவாலயத்தின் ப்ளான் என்ன?

கூட்டணி கட்சிகளிடம், தொகுதிகளை குறைத்துக் கொள்ள சொல்லி வலியறுத்திக் கொண்டிருக்கிறது அறிவாலயம்....

LPG crisis: ఎల్‌పీజీ సంక్షోభం.. తగ్గిన స్విగ్గీ, జొమాటో డెలివరీలు..

LPG crisis: మిడిల్ ఈస్ట్ యుద్ధం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి....