13
March, 2026

A News 365Times Venture

13
Friday
March, 2026

A News 365Times Venture

Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసింగ్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్న కేటీఆర్

Date:

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. కేటీఆర్ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి పది గంటలకు ACB కార్యాలయంలో విచారణ కు వెళ్లనున్నారు. ఈ కారు రేసు కేసులో నీధుల మళ్లింపు, క్యాబినెట్‌ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలం బిజినెస్‌ రూల్స్‌ ఉల్లంఘనపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనున్నది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌ను ఏసీబీ, ఈడీలు విచారించాయి.

Also Read:Seediri Appalaraju: మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్న..

ఫార్ములా ఈ-ఆపరేషన్స్‌ సంస్ధ ప్రతినిధులను గతంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏసీబీ ప్రశ్నించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిలను విచారించింది. కేటీఆర్‌ విచారణ అనంతరం ఏసీబీ ఈ కేసులో చార్జిషీట్‌ దాఖలు చేయనున్నది. కేటీఆర్ వెంట బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఏసిబి కార్యాలయం వచే అవకాశాం ఉంది. ఈ నేపథ్యంలో ఏసిబి కార్యలయం రూట్ మ్యాప్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಅಡಿಕೆ ಕಳ್ಳತನ ಮಾಡಿದ್ದ ಮೂವರು ಕಳ್ಳರು ಅಂದರ್

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,12,2026 (www.justkannada.in): ಸುಮಾರು 15 ಕ್ವಿಂಟಾಲ್ ನಷ್ಟು ಅಡಿಕೆಯನ್ನು ಕಳ್ಳತನ...

ഞെട്ടിപ്പിക്കുന്ന സംഭവം, ഉടന്‍ സമഗ്രമായ അന്വേഷണം നടത്തണം; ഫാറൂഖ് അബ്ദുല്ലക്ക് നേരെയുണ്ടായ വധശ്രമത്തില്‍ എം.എ. ബേബി

ന്യൂദല്‍ഹി: ജമ്മു കശ്മീര്‍ മുന്‍ മുഖ്യമന്ത്രി ഫാറൂഖ് അബ്ദുല്ലക്ക് നേരെയുണ്ടായ വധശ്രമം...

'6 தொகுதிகள் கொடுத்தே ஆகணும்' – கறார் காட்டும் கம்யூனிஸ்டுகள்; கைவிரித்த திமுக!

கம்யூனிஸ்ட் கட்சிகளுடனான தி.மு.க-வின் தொகுதி பங்கீட்டு பேச்சுவார்த்தையில் தொடர் இழுபறி நீடிக்கிறது....