18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

HHVM Pre Release Event: ఫాన్స్ గెట్ రెడీ అమ్మ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్?

Date:

‘పవర్ స్టార్’ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. జూన్‌ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ కార్యక్రమాలు స్పీడ్‌ అందుకున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమా ట్రైలర్ కోసం ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ వారంలోనే ట్రైలర్ రిలీజ్ ఉంటుందని వార్తలు రాగా.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈవెంట్ డేట్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం.

జూన్‌ 8న తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ స్టేడియంలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు ఎస్వీయూనివర్సిటీ రిజిస్టార్‌కు మెగా సూర్య ప్రొడక్షన్ లేఖ రాసింది. ఇక ఈ ఈవెంట్ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ 7వ తేదీన తిరుప‌తి చేరుకోనున్నట్టు తెలుస్తుంది. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజ‌రు కానున్నార‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నారు. కానీ పవన్‌తో కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే ప్రీ రిలీజ్ విషయంలో మేకర్స్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్శకులు క్రిష్ జాగర్లమూడి ,జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన ఈ భారీ పీరియాడిక్ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕೈಗಾರಿಕೆಗಳು ಹೊರ ಹೋಗುತ್ತಿರುವುದು ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯಗಳ ಕೊರತೆಯಿಂದಲ್ಲ-ಸಚಿವ ಭೈರತಿ ಸುರೇಶ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,17,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದ ಕೈಗಾರಿಕೆಗಳು ಮೂಲಭೂತ ಸೌರ್ಕಯಗಳ ಕೊರತೆಯಿಂದ ಹೊರಹೋಗುತ್ತಿಲ್ಲ....

‘ഇറാന്‍ ഒരു ആസന്ന ഭീഷണിയല്ല, ഈ യുദ്ധം ഇസ്രായേലിന് വേണ്ടി’; രാജിവച്ച് അമേരിക്കന്‍ ഭീകരവിരുദ്ധ സമിതി മേധാവി

വാഷിങ്ടണ്‍: ഇറാനെതിരായ യു.എസ്- ഇസ്രഈല്‍ ആക്രമണത്തെ എതിര്‍ത്ത് യു.എസ് ഭീകരവിരുദ്ധ സമിതിയിലെ...

'ரஜினியை பற்றி பேசினால்…' – ஆதவ் இருந்த மேடையிலேயே கொந்தளித்த ரஜினி ரசிகர்

சென்னை கொளத்தூரில் தவெகவின் கொள்கை விளக்கப் பொதுக்கூட்டம் நடந்திருந்தது. இந்தக் கூட்டத்தில்...