20
March, 2026

A News 365Times Venture

20
Friday
March, 2026

A News 365Times Venture

Avinash Reddy: టీడీపీ పైశాచిక ఆనందం పొందుతోంది.. ఎంపీ ఫైర్..!

Date:

Avinash Reddy: కడప జిల్లాలో మహానాడు అంటూ టీడీపీ పైశాచిక ఆనందం పొందుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా అన్ని స్థానాల్లో ఓటమి తప్పదని ఆయన జోష్యం చెప్పారు. పులివెందులలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాల చుట్టూ జెండాలు, తోరణాలు కట్టడంపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రాంతం ప్రజల ఎమోషన్ వైయస్సార్ అని, ఆయన విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యతా అంటూ ప్రశ్నించారు.

Read Also: IPL 2025:’ఆర్‌సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్‌ వైరల్

తాము కక్ష సాధింపు రాజకీయం చేసి ఉండి ఉంటే.. మీ పరిస్థితి వేరేగా ఉండేదని, మాకు తగిలిన దెబ్బ మర్చిపోమన్నారని అన్నారు. దీనిపై పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి ఘాటుగా స్పందించారు. టీడీపీ తోరణాలు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజమైన వైయస్సార్ అభిమానులు ఒక్కసారి ఆలోచించాలి అన్నారు. వై ఎస్ విజయమ్మ పై కేసు నమోదు చేసింది ఎవరు? కార్యకర్త ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.

Read Also: TDP Mahanadu: అపోహలు చెదరగొట్టిన మహానాడు.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి..!

అలాగే షర్మిలకు రావలసిన ఆస్తిని రాకుండా చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి రాముడైతే లక్ష్మిడిలా పనిచేసిన వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని కాలర్ పట్టుకుని నిలదీయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఇక మహానాడు కార్యక్రమంలో మూడు రోజులు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయో కూడా తెలియకుండా కడప ఎంపీ విమర్శించడం విడ్డురంగా ఉందన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ശബരിമല സ്ത്രീപ്രവേശനം: ആചാരങ്ങളില്‍ ഏകപക്ഷീയമായ നിലപാടില്ല, ചര്‍ച്ചകള്‍ വേണമെന്ന് മുഖ്യമന്ത്രി

തിരുവനന്തപുരം: ശബരിമലയിലെ സ്ത്രീ പ്രവേശനവുമായി ബന്ധപ്പെട്ട വിഷയത്തില്‍ വിശ്വാസികളെ പരിഗണിച്ചുകൊണ്ടുള്ള സമവായത്തിന്റെ...

அதிமுக – பாஜக கூட்டணியின் தொகுதிப் பங்கீடு விவரம் எப்போது வெளியாகும்? – டெல்லியில் இபிஎஸ் பதில்

தமிழகத்தில் சட்டமன்றத் தேர்தல் நெருங்கிக்கொண்டிருக்கிறது. கட்சிகள், தொகுதிப் பங்கீடு பேச்சுவார்த்தைகளை நடத்தி...

S.S.Thaman: త్రివిక్రమ్ నా గురువు.. వచ్చే సినిమాతో ఆస్కారే లక్ష్యం!

S.S.Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ తన కెరీర్‌లో ఎందరో దర్శకులతో...

ರಾಜ್ಯದ ಹಲವೆಡೆ ಇಂದು ಮಳೆ ಸಾಧ್ಯತೆ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,20,2026 (www.justkannada.in): ಬೆಂಗಳೂರು ಸೇರಿದಂತೆ ರಾಜ್ಯದ ಹಲವೆಡೆ ಇಂದು ಮಳೆಯಾಗುವ...