18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

Shakur Khan: పాక్ గూఢచారి షకుర్ ఖాన్‌ అరెస్ట్.. రాజస్థాన్ మాజీ మంత్రితో సంబంధాలు!

Date:

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి షకుర్ ఖాన్‌ను బుధవారం రాత్రి జైసల్మేర్‌లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది. షకుర్ ఖాన్‌పై గత కొన్ని వారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. పాక్‌ దౌత్య కార్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉన్నత స్థాయి సమాచారం మేరకు షకుర్ ఖాన్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సుధీర్ చౌదరి తెలిపారు. ఇక షకుర్ ఖాన్‌ ఫోన్‌లో పలువురి పాకిస్థానీయుల నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి గురించి సరైన సమాధానం ఇవ్వలేనట్లుగా తెలుస్తోంది. ఇక పాకిస్థాన్‌కు ఏడు సార్లు వెళ్లినట్లుగా గుర్తించారు. అయితే మొబైల్స్‌లో కొన్ని ఫైల్స్ డిలీట్ అయినట్లుగా కనిపెట్టారు. అలాగే బ్యాంక్ ఖాతాలపై కూడా దృష్టి పెట్టారు. ఇటీవలే ఒక ఖాతా క్లోజ్ అయింది. దానిపై కూడా ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి: MLC Kavitha : మిస్టర్ కేటీఆర్ నాతో పెట్టుకోవద్దు… విరుచుకుపడ్డ కవిత..

ఇదిలా ఉంటే షకుర్ ఖాన్‌కు రాజస్థా్న్ మాజీ మంత్రి షేల్ మొహమ్మద్‌తో మంచి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా వ్యక్తిగత సహాయకుడిగా పని చేసినట్లు అధికారులు గుర్తించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో షేల్ మొహమ్మద్‌ మంత్రిగా పని చేశారు. షకుర్ ఖాన్-షేల్ మొహమ్మద్ గ్రామాలు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. మొహమ్మద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పని చేశారు. అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు.

ఇది కూడా చదవండి: Allu Arjun : గౌరవంగా భావిస్తున్నా.. గద్దర్ అవార్డుపై అల్లు అర్జున్..

షకుర్ ఖాన్‌ తరచుగా మొహమ్మద్ తండ్రి ఘాజీ ఫకీర్‌ను కలిసేవాడని స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో షకుర్ ఖాన్, మొహమ్మద్, ఘాజీ ఫకీర్ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. ఇక 2021లో ఘాజీ ఫకీర్ మరణించారు.

మే 7న ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దులో జైసల్మేర్‌పై అధికారులు నిఘా పెట్టినట్లుగా పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ చౌదరి తెలిపారు. సరిహద్దులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అదుపులోకి తీసుకున్న ఏడో వ్యక్తి షకుర్ ఖాన్ అని వెల్లడించారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌కు సింధు జలాలు నిలిపేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసేసింది. అనంతరం మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಹೊಸ ಬಸ್ ಖರೀದಿಗೆ ಟೆಂಡರ್: ಕೊರತೆ ಇರುವ ಕಡೆ ಬಸ್ ಗಳನ್ನು ಒದಗಿಸುತ್ತೇವೆ- ಸಚಿವ ರಾಮಲಿಂಗರೆಡ್ಡಿ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in): ನಾವು ಬಂದ ಮೇಲೆ ಸುಮಾರು 6 ಸಾವಿರ...

‘ആത്മാര്‍ത്ഥമായി നന്ദി പറയുന്നു’; മെഡിക്കല്‍ സഹായവുമായി ഇന്ത്യയുടെ ആദ്യ കപ്പല്‍ ഇറാനില്‍

ടെഹ്‌റാന്‍: പശ്ചിമേഷ്യന്‍ സംഘര്‍ഷത്തിനിടെ മെഡിക്കല്‍ സഹായവുമായി ഇന്ത്യയുടെ ആദ്യ കപ്പല്‍ ഇറാനിലെത്തി....

'உயிரோடு தான் இருக்கிறேன்' – நிரூபிக்க போராடும் நெதன்யாகு: வீடியோக்களும், சர்ச்சைகளும்! |Full Detail

இஸ்ரேல் பிரதமர் நெதன்யாகு உயிரோடு இருக்கிறாரா... இல்லையா?- இது தற்போது ஈரான்...

100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

OnePlus 15T: కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్...