18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

YS Jagan: వైఎస్ జగన్ పొదిలి పర్యటన వాయిదా!

Date:

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. బుధవారం (మే 28) పొదిలిలో జగన్ పర్యటించాల్సి ఉండగా.. వాయిదా పడిందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పొదిలి పర్యటన వాయిదా పడినట్లు పేర్కొంది. వాతావరణం అనుకూలించిన తర్వాత వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా పర్యటన తేదీలను వైసీపీ ఖరారు చేయనుంది.

Also Read: CM Chandrababu: అదే నా ఆశ.. ఆకాంక్ష!

పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం పొదిలి పోరుబాట కార్యక్రమాన్ని వైసీపీ తలపెట్టింది. కూటమి పాలనలో మద్ధతు ధర లేక రైతాంగం కష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా సమస్యలు తెలుసుకోవాలని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై జగన్ ఒత్తిడి తేనున్నారు. జగన్ పర్యటనకు భారీగా రైతులు, వైసీపీ శ్రేణులు తరలి వచ్చే అవకాశం ఉంది. పొదిలి పర్యటన కోసమే ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే భారీ వర్షాల నేపథ్యంతో పర్యటన వాయిదా పడింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೃತ ಮೂವರು ರಿಸರ್ವ್ ಸಬ್ ಇನ್ಸ್‌ಪೆಕ್ಟರ್‌ ಗಳ ಕುಟುಂಬಕ್ಕೆ ಪರಿಹಾರ ಘೋಷಿಸಿದ ಸಿಎಂ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in): ಚಿತ್ರದುರ್ಗ ಜಿಲ್ಲೆಯ ಚಳ್ಳಕೆರೆ ತಾಲ್ಲೂಕಿನ ಹೆಗ್ಗೆರೆ ಗೇಟ್...

ഭീരുത്വപരമായ വധം; ഇറാന്‍ ഇന്റലിജന്‍സ് മന്ത്രി കൊല്ലപ്പെട്ടെന്ന് സ്ഥിരീകരിച്ച് പെസസ്‌കിയാന്‍

ടെഹ്‌റാന്‍: ഇറാന്റെ ഇന്റലിജന്‍സ് മന്ത്രി എസ്മായില്‍ ഖത്തീബ് കൊല്ലപ്പെട്ടെന്ന് സ്ഥിരീകരിച്ച് ഇറാന്‍...

தவெக: "நான் முதல் மாநாட்டுல சொன்ன மாதிரிதான்" – கூட்டணி சர்ச்சைகளுக்கு விஜய்யின் விளக்கம் என்ன?

தமிழக வெற்றிக் கழகத்தின் இஃப்தார் நோன்பு திறக்கும் நிகழ்வு இன்று மகாபலிபுரத்திலுள்ள...

Story Board: డబ్బిస్తే.. ఏదైనా చేసుకోవచ్చా..? ఫామ్ హౌస్‌లో ఏం జరుగుతోంది..?

Story Board: హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్‌హౌస్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అసలు...