19
March, 2026

A News 365Times Venture

19
Thursday
March, 2026

A News 365Times Venture

AP News : ఇద్దరు పిల్లల తల్లి(40)ని ప్రేమ వివాహం చేసుకున్న 25 ఏళ్ల యువకుడు.. చివరికీ..

Date:

వయసులో ఉన్న యువతి, యువకుడు పెళ్లి చేసుకుని సంసారం చెయ్యడం సర్వసాధారణం. వివాహం చేసుకున్న తరువాత దంపతుల మధ్య గొడవలు రావడం, విడిపోవడం ప్రతిరోజు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ భలే గమ్మత్తు అయిన విషయం వెలుగు చూసింది. 40 ఏళ్ల ఆంటీని ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థక కారణంగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

READ MORE: Vishnupriya : చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న విష్ణుప్రియ

అసలు విషయం ఏంటంటే?
విశాఖపట్నానికి చెందిన పద్మ(40) ఓ యువకుడి ప్రేమలో పడింది. ఆమెకు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసే కొడుకు, డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న కూతురు ఉన్నారు. కానీ సోషల్ మీడియా పద్మను ముంచేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఏడాది కిందట శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీకి పాతికేళ్ల సురేష్ పరిచయమయ్యాడు.. సురేష్ ఓ మొబైల్ దుకాణంలో పని చేసేవాడు. ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ సురేష్ లెక్కచేయలేదు. ఆమెకు కూడా అంతే.. కుటుంబాన్ని వదిలేసిన పద్మ గతంలో యువకుడి కోసం విశాఖపట్నం నుంచి శ్రీకాళహస్తికి వచ్చేసింది. పోలీసుల ఫిర్యాదు చేసిన భర్త ఎలాగోలా ఇంటికి రప్పించాడు. కానీ సురేష్‌తోనే కలిసి జీవించాలని ఆమె నిర్ణయించుకుంది.

READ MORE: Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌!

గతేడాది నవంబర్‌లో ఉత్తరం రాసి మళ్లీ ప్రియుడి చెంతకు చేరింది. కుటుంబ సభ్యులు ఎంత బతిమలాడినా ఫలితం లేకుండా పోయింది. పద్మ, సురేష్ పెళ్లి చేసుకున్నారు. యువకుడి కుటుంబీకులు అంగీకరించలేదు. కైలాసగిరి కాలనీలో పద్మతో సురేష్ కాపురం పెట్టారు. కొన్ని రోజులు బాగానే గడిచింది. మేన 22న పద్మ అకస్మాత్తుగా ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా సురేష్ సురేష్ ఈ విషయాన్ని బయటకు రానీయలేదు. మరునాడు తాను కూడా పురుగుల మందు తాగాడు.

READ MORE: Covid cases: దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్లు గుర్తింపు.. పెరుగుతున్న కేసులు..

సురేష్‌ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాళాలు పగులగొట్టిన పోలీసులకు పద్మ మృతదేహం.. కొన ఊపిరితో ఉన్న సురేష్‌ ను చూసి షాక్ అయ్యారు. సురేష్‌ను ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి సురేష్ చికిత్స పొందుతూ కన్నుముశాడు. టిఫిన్, భోజనాన్ని వృథా చేయడంతో సురేష్ మందలించాడని.. గొడవ పెరిగి పెద్దదై పద్మ బలవన్మరణానికి పాల్పడేంత వరకు వచ్చిందని చెబుతున్నారు. చేతికొచ్చిన కొడుకు దూరం కావడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ వయసులో తప్పటడుగు వేసిన తల్లి మృత్యువు ఒడికి చేసుకోవడంతో పద్మ కుమారుడు, కుమార్తె కన్నీరు పెట్టుకున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನಮಗೆ ಗೆಲುವೇ ಮಾನದಂಡ: ಸಿಎಂ,ಡಿಸಿಎಂ, ಹೈಕಮಾಂಡ್ ತೀರ್ಮಾನಕ್ಕೆ ಬದ್ದ- ಸಚಿವೆ ಲಕ್ಷ್ಮೀ ಹೆಬ್ಬಾಳ್ಕರ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in):  ಬಾಗಲಕೋಟೆ,ದಾವಣಗೆರೆ ದಕ್ಷಿಣ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಉಪಚುನಾವಣೆಗೆ ಅಭ್ಯರ್ಥಿಗಳ...

സായുധ പ്രതിരോധം ഇസ്രഈലിനെതിരെ ഫലപ്രദമാണെന്ന് തെളിഞ്ഞു: ഹിസ്ബുല്ല

ബെയ്‌റൂട്ട്: ഇസ്രഈലിനെ പ്രതിരോധിക്കാന്‍ ആയുധമെടുക്കുന്നത് ഫലപ്രദമാണെന്ന് തെളിയിക്കപ്പെട്ടെന്ന് ഹിസ്ബുല്ല സെക്രട്ടറി ജനറല്‍...

Notary Portal: "தமிழ்நாடே இல்லையா?" – மத்திய அரசின் நோட்டரி இணையதளத்தில் நிலவும் பெரும் குளறுபடி

பொதுமக்களுக்குச் சட்டப்பூர்வமான ஆவணச் சான்றொப்பம் மற்றும் உறுதிமொழிப் பத்திரங்களை வழங்கும் நோட்டரி...

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం తాజాగా టిడ్కో ఇళ్లకు సంబంధించిన కీలక...