19
March, 2026

A News 365Times Venture

19
Thursday
March, 2026

A News 365Times Venture

Indian Economy: ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మనమే..!

Date:

Indian Economy: జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. మొత్తం ప్రపంచ, ఆర్థిక వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. నేడు మనం $4,000 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించామన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి డేటాను ఉటంకిస్తూ.. నేడు భారతదేశం జపాన్ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దదని నీతి ఆయోగ్ సీఈవో పేర్కొన్నారు.

Read Also: AlluArjun : అల్లు అర్జున్‌ అట్లీ మూవీలో నాని హీరోయిన్.. ?

అయితే, అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందు ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. మనం మన ప్రణాళిక, ఆలోచనకు కట్టుబడి ఉన్నాం.. రెండున్నర నుంచి మూడు ఏళ్లలోనే మనం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని పేర్కొన్నారు. ఐఫోన్ కంపెనీ ఆపిల్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు నీతి ఆయోగ్ సీఈవో సమాధానమిస్తూ, “టారిఫ్ రేట్లు ఎలా ఉంటాయో అనిశ్చితంగా ఉంటుంది.. కానీ పరిస్థితులు మారుతున్న తీరును బట్టి, మేము తయారీకి చౌకైన ప్రదేశంగా మారతామన్నారు. భారత్ తో పాటు మరెక్కడా ఆపిల్ ఐఫోన్లు తయారీ కేవలం అమెరికాలోనే ఉత్పత్రి అవుతుందని తాను ఆశిస్తున్నానని ట్రంప్ అన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ కూడా ఆస్తుల మానిటైజేషన్ రెండవ దశను రెడీ చేస్తున్నామని.. దాన్ని ఆగస్టులో ప్రకటిస్తామని వెల్లడించారు.

Read Also: Shashi Tharoor: ఉగ్రవాదం ప్రపంచానికి అతి పెద్ద సమస్య.. పాక్పై శశిథరూర్ ఫైర్!

ఇక, 2025 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండవచ్చు అని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం చెప్పుకొచ్చారు. అంటే ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. వ్యవసాయం, హోటళ్ళు, రవాణా, నిర్మాణం లాంటి రంగాల బలమైన పని తీరు ఈ పెరుగుదలకు కారణం అన్నారు. ఈ సమాచారం కేర్ ఏజ్ రేటింగ్స్ అనే సంస్థ రిపోర్టులో పేర్కొనింది. నివేదిక ప్రకారం, పట్టణ, గ్రామాల్లో ప్రజల షాపింగ్ పెరిగిపోయింది. ఇది వినియోగాన్ని మరింత బలపరిచింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಚುನಾವಣಾ ವಿಚಾರ ಸಿಎಂ ಕಚೇರಿಯಲ್ಲಿ ಚರ್ಚಿಸಿದ್ದು ತಪ್ಪು – ಆರ್.ಅಶೋಕ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in):  ಬಾಗಲಕೋಟೆ ವಿಧಾನಸಭೆ ಉಪಚುನಾವಣೆ ಟಿಕೆಟ್   ಕುರಿತ ವಿಚಾರವನ್ನ...

തരൂരിനെ പിന്തുണച്ചതിന് അപമാനിക്കപ്പെട്ടു; കോണ്‍ഗ്രസ് വിട്ട് ബി.ജെ.പിയില്‍ ചേര്‍ന്ന് അസം എം.പി

ഗുവാഹത്തി: മുതിര്‍ന്ന നേതാവ് ശശി തരൂരിനെ പിന്തുണച്ചതിന്റെ പേരില്‍ കോണ്‍ഗ്രസിനുള്ളില്‍ നിന്നും...

முரண்டு பிடிக்கும் சிபிஎம்; ஆப்சென்ட் ஆன விசிக! – கூட்டணி தலைவலியில் அறிவாலயம்!

திமுக கூட்டணியில் நிலவி வரும் இழுபறிக்கு இன்னமும் ஒரு முடிவு கிடைக்கவில்லை....

Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

Off The Record: తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు...