13
March, 2026

A News 365Times Venture

13
Friday
March, 2026

A News 365Times Venture

CS Ramakrishna Rao: ఐఏఎస్‌ శరత్ వ్యవహార శైలిపై సీఎం ఆగ్రహం.. చర్యలు తప్పవని సీఎస్ హెచ్చరిక!

Date:

సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఐఏఎస్ అధికారి శరత్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. సభలో పాల్గొనడానికి వచ్చిన సీఎం కాళ్లు మొక్కారు. ఐఎఎస్ శరత్ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ కాళ్లు ఐఏఎస్ శరత్ మొక్కడంపై ఆల్ ఇండియా సర్వీసెస్ అధికార వర్గాల్లో చర్చ జరిగింది. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే.రామకృష్ణారావు సీరియస్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read: Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌!

సివిల్ సర్వీసెస్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు స్థాయికి తగినట్లుగా ఉండకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సభలు, సమావేశాల్లో ఉన్నతాధికారులు హుందాగా వ్యవహరించాలి. సభలు, సమావేశాల్లో హుందాగా ఉండకపోతే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రజలను కలిసినప్పుడు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ప్రొఫెషనలిజం ప్రదర్శించాలి. ప్రజాప్రతినిధుల పట్ల సివిల్ సర్వీసెస్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించొద్దు. ఇకపై ఏ అధికారి నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవు’ అని సీఎస్ హెచ్చరించారు. గతంలో ఐఏఎస్‌లు ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఇకపై ఐఏఎస్‌లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అలా వ్యవహరించవొద్దని సీఎస్‌తో సీఎం ఆదేశాలు ఇప్పించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇന്ധനക്ഷാമമില്ല, എല്‍.പി.ജി ഉത്പാദനം 28% വര്‍ധിപ്പിച്ചു; വ്യാജപ്രചരണം വേണ്ട: ഹര്‍ദീപ് സിങ്

ന്യൂദല്‍ഹി: ഇന്ത്യയിലെ ഊര്‍ജ ഇറക്കുമതി സുരക്ഷിതമായി തുടരുകയാണെന്ന് പെട്രോളിയം മന്ത്രി ഹര്‍ദീപ്...

சென்னை ரயில் நிலையங்களில் இந்தி எழுத்துகள் அழிப்பு போராட்டத்தில் மே 17 இயக்கத்தினர்!

தமிழ்நாட்டில் இந்தி திணிப்புக்கு எதிராக தொடர்ந்து குரல் எழுப்பப்பட்டு வருகிறது. அந்தவகையில்...

Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

Lifetime Achievement Award: భారత మాజీ క్రికెటర్, మాజీ టీమిండియా కోచ్,...