16
March, 2026

A News 365Times Venture

16
Monday
March, 2026

A News 365Times Venture

Delhi : పాకిస్థాన్ ఇన్ఫార్మర్లుగా భారతీయులు.. లేడీ యూట్యూబర్ సహా ఆరుగురు అరెస్ట్

Date:

పాకిస్థాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్‌తో సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్‌వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో “ట్రావెల్ విత్ జో” అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది.. 2023లో పాకిస్థాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా.. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో సిబ్బందిగా పనిచేస్తున్న ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది.

READ MORE: Team India New Captain: టీమిండియా టెస్టు కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. గిల్- గంభీర్ కీలక భేటీ..

కాగా.. డానిష్‌ను ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించి, మే 13, 2025న దేశం నుంచి బహిష్కరించింది. డానిష్ జ్యోతిని పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIO)కి పరిచయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. డానిష్ ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె అతనితో సమన్వయంగా మెలిగింది. ఇది మరింత అనుమానాలను రేకెత్తించింది. జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఆమె సోషల్ మీడియాలో పాకిస్థాన్ పట్ల సానుకూల చిత్రాన్ని ప్రదర్శించడమే కాకుండా.. దేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని కూడా పాక్‌తో పంచుకుంది.

READ MORE: AP Liquor Case: ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు..

జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం, 1923లోని సెక్షన్ 3, 4,5 కింద అభియోగాలు మోపారు. ఆమె ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఈ కేసులో పంజాబ్‌లోని మలేర్‌కోట్లాకు చెందిన 32 ఏళ్ల వితంతువు గుజాలా, యమీన్ మొహమ్మద్, దేవిందర్ సింగ్ థిల్లాన్, అర్మాన్, బాను నస్రీనా ఉన్నారు. వీరు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಅಭಾವ: ಗ್ರಾಹಕರು ಹೆಚ್ಚು ಹೆಚ್ಚು ಬುಕ್ ಮಾಡಬೇಡಿ – ಸಚಿವ ಕೆ.ಎಚ್ ಮುನಿಯಪ್ಪ.

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,16,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದಲ್ಲಿ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಅಭಾವವಿದೆ. ಪರಿಸ್ಥಿತಿ ಗಂಭೀರವಾಗಿದ್ದು,...

കണ്ണൂരില്‍ മത്സരിക്കണമെന്ന് പറഞ്ഞ് കെ. സുധാകരന്‍ കരയുന്നു; ജി. സുധാകരന്റേത് ഒരു വിഷയമേ അല്ല: എം.വി ഗോവിന്ദന്‍

തിരുവനന്തപുരം: കോണ്‍ഗ്രസില്‍ പടല പിണക്കങ്ങളാണെന്ന ആരോപണവുമായി സി.പി.ഐ.എം സംസ്ഥാന സെക്രട്ടറി എം....

கூட்டணிக்கு தனி ரூட் பிடித்த ஆனந்த்; கடுப்பான விஜய்! தவெக – NDA கூட்டணி(?) நிலவரம் என்ன?

தவெக - NDA இடையே தீவிரமாக கூட்டணி பேச்சுவார்த்தை நடந்து வருவதாக...

Metpally: హనుమాన్ మాలలో ఉన్న విద్యార్థులకు ప్రవేశం నిరాకరణ.. స్కూల్ వద్ద ఉద్రిక్తత..!

Metpally: జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....