15
March, 2026

A News 365Times Venture

15
Sunday
March, 2026

A News 365Times Venture

India Pakistan Tension: భారత్ “బ్రహ్మోస్‌‌”తో భీకర దాడి.. పాక్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్.?

Date:

India Pakistan Tension: ఆపరేషన్ సిందూర్ దాటికి పాకిస్తాన్ నిలవలేకపోయింది. ఇన్నాళ్లు మేము గొప్ప మిలిటరీ శక్తిగా భావిస్తూ వచ్చిన పాకిస్తాన్‌కి, భారత్‌ దాడులు దాని స్థాయి ఎంటో నిరూపించింది. పాకిస్తాన్ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలపై భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్ లోని ఎయిర్‌బేస్‌లను భారత్ లక్ష్యంగా చేసుకుని భీకర దాడి చేసింది. అయితే, ఇప్పుడు ఓ సమాచారం పాకిస్తాన్‌లో వణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అణు స్థావరాలపై భారత్ బ్రహ్మోస్‌తో దాడులు చేసినట్లు తెలుస్తోంది. బ్రహ్మోస్ ధాటికి పాక్ అణ్వాయుధాల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లు సమాచారం. దీని కారణంగా, పాకిస్తాన్ అమెరికా కాళ్లు పట్టుకుని భారత్‌ని కాల్పుల విరమణకు ఒప్పించాలని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది.

శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలోని నూర్ కాన్ ఎయిర్ బేస్‌పై భారత్ బ్రహ్మోస్ తో దాడి చేసినట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాటలు కూడా భారత్, పాకిస్తాన్‌పై బ్రహ్మోస్‌తో దాడి చేసినట్లు వెల్లడిస్తోంది. నూర్‌కాన్ బేస్ వద్ద అండర్‌గ్రౌండ్‌లో అణ్వాయుధాలను పాకిస్తాన్ దాచినట్లు తెలుస్తోంది. నూర్‌కాన్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్‌లపై భారత్ దాడితో బంకర్లు బద్ధలవడంతో అణ్వాయుధాలు దెబ్బతిని, వాటి నుంచి రేడియేషన్ లీక్ అయినట్లు తెలుస్తోంది. దీనిని పరిశీలించేందుకు అమెరికా న్యూక్లియర్ అడిట్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ చేరుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: Pithapuram Crime: పిఠాపురంలో చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అంతా అమ్మమ్మే చేసింది!

మే 10 తేదీ శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ లోని మొత్తం 11 ఎయిర్ బేస్‌లని భారత్ కేవలం 90 నిమిషాల్లోనే నాశనం చేసింది. ఈ దాడుల్లో బ్రహ్మోస్ వాడినట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్ బేసుల్లో సర్గోదా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సర్గోదాకు సమీపంలోని కార్ని పర్వతాల్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెడుతుంది. ఈ పర్వతాల్లోనే అనేక సొరంగాల్లో పాక్ వీటిని భద్రపరుస్తుంది. అయితే, దీనిపై భారత్ దాడి చేసింది. ఈ దాడుల్లో కార్ని పర్వతాల్లోని గేట్ల వద్ద భారత్ దాడి చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో, శనివారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. 4.0 తీవ్రతతో భూప్రంకపనలు రావడం కూడా ఇందుకు అనుమానాలు రేకెత్తిస్తోంది. భారత్ దాడికి ఏదైనా అణ్వాయుధం భూగర్భంలో పేలిందా..? అనే ప్రశ్నలు వెలువడుతున్నా్యి. అణ్వాయుధాలతో భారత్ ‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్న పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పడానికి ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗೂಡ್ಸ್ ರೈಲು ಡಿಕ್ಕಿ : ಮೂವರು ಯುವಕರು ಸಾವು.

ಮುಂಬೈ,ಮಾರ್ಚ್,14,2026 (www.justkannada.in):  ಗೂಡ್ಸ್ ರೈಲು ರೈಲು ಡಿಕ್ಕಿಯಾಗಿ ಮೂವರು ಯುವಕರು...

ഏത് വിധേനെയും ഹോര്‍മുസ് തുറക്കും; ചൈനയും യു.കെയും ഉള്‍പ്പടെയുള്ള രാജ്യങ്ങള്‍ യുദ്ധക്കപ്പലുകള്‍ അയക്കുമെന്ന് ട്രംപ്

വാഷിങ്ടണ്‍: ഇറാന്റെ നിയന്ത്രണത്തിലുള്ള ഹോര്‍മുസ് കടലിടുക്ക് തുറക്കാന്‍ ഏത് മാര്‍ഗവും സ്വീകരിക്കുമെന്ന്...

இறுதியான என்.ஆர் – பாஜக கூட்டணி; தவெக-வுக்கு வலை வீசும் ரங்கசாமி! – புதுவையில் விசிலடிப்பாரா விஜய்?

புதுச்சேரி, தமிழகம் உட்பட ஐந்து மாநில சட்டப்பேரவை தேர்தலுக்கான அறிவிப்பு இன்றே...

Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

అద్దె కారు తీసుకున్నారు.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు.. మధ్యలో ఓ కన్నింగ్...