16
March, 2026

A News 365Times Venture

16
Monday
March, 2026

A News 365Times Venture

Hero Vishal: హీరో విశాల్‌కు తీవ్ర అస్వస్థత..! వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన విశాల్‌..

Date:

Hero Vishal: హీరో విశాల్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు విశాల్‌.. తమిళనాడులోని విల్లుపురంలో ఈ ఘటన జరిగింది.. విల్లుపురంలో ఈ రోజు జరిగిన కూవాకం కూతాండవర్ దేవాలయ ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరునంగైవుల అలకిప్ పోటీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నటుడు విశాల్, ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.. అయితే, ఆ వేదికపై ఆయన స్పృహతప్పి పడిపోయారు.. అయితే, ప్రాథమిక చికిత్స తర్వాత అనారోగ్యం నుంచి కాస్త తేరుకున్నారు విశాల్.. ఈ ఘటనతో ఆ కార్యక్రమంలో కొద్దిసేపు కలకలం రేగింది.. కాగా, గత జనవరిలో మదగజరాజా చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న విశాల్‌ను చూసి అంతా షాక్‌ తిన్నారు.. అతని ఆరోగ్యం గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం విశాల్‌ మళ్లీ స్పృహతప్పి పడిపోయిన ఘటన అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.. ఇక, ప్రాథమిక చికిత్స తర్వాత సమీపంలోని ఆస్పత్రికి విశాల్‌ను తరలించారు.. ఆహారం తినకపోవడంతోనే విశాల్‌ స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపినట్టుగా తెలుస్తుండగా.. అరగంట విశ్రాంతి అనంతరం తిరిగి కార్యక్రమానికి హాజరయ్యారు విశాల్..

Read Also: Deputy CM Pawan Kalyan: రక్షణ దళాల సిబ్బందికి గుడ్‌న్యూస్‌.. పవన్‌ కీలక ప్రకటన

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు

లాస్ ఏంజిల్స్: ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారాలైన 98వ అకాడమీ...

2026 നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പ് നിര്‍ണായകം; കേരളത്തില്‍ എല്‍.ഡി.എഫ് വീണ്ടും അധികാരത്തില്‍ വരും: ഡി. രാജ

ചെന്നൈ: കേരളത്തില്‍ മൂന്നാം തവണയും എല്‍.ഡി.എഫ് അധികാരത്തില്‍ വരുമെന്ന് സി.പി.ഐ ജനറല്‍...

"உயிருடன் இருந்தால் விடமாட்டோம்" – நெதன்யாகுவுக்கு ஈரான் இராணுவம் நேரடி கொலை மிரட்டல்!

கடந்த பிப்ரவரி 28 அன்று, அமெரிக்கா மற்றும் இஸ்ரேல் இணைந்து ஈரான்...

Netanyahu: ‘అవును నేను చనిపోయాను’.. మరో వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..

ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారని సోషల్ మీడియాలో...