26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

CM Revanth Reddy Vijayawada Visit: రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. విషయం ఇదే..!

Date:

CM Revanth Reddy Vijayawada Visit: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. బుధవారం రోజు విజయవాడ వెళ్లనున్నారు.. బెజవాడలో జరగనున్న తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహానికి హాజరు కాబోతున్నారు రేవంత్‌ రెడ్డి.. ఇక, విజయవాడ పర్యటన కోసం ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు.. ఉదయం 10.40 గంటలకు కానూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు.. ఉదయం 10.50 గంటల నుండి 11.30 గంటల వరకు అయన కల్యాణ మండపం నందు.. దేవినేని ఉమా కుమారుడు వివాహానికి హాజరై.. వధూవరులను ఆశీర్వదించనున్నారు.. విజయవాడ నుంచి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి..

Read Also: YS Jagan: అందరూ ధోనీల్లా తయారు కావాలి.. పార్టీ నేతలకు జగన్‌ దిశానిర్దేశం

కాగా, గత వారం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. తన కుమారుడు వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎంకు అందించి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.. మరోవైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన రేవంత్‌ రెడ్డి.. దేవినేని ఉమాతో సన్నిహితంగా ఉండేవారు.. ఆ తర్వాత పార్టీ మారి.. తెలంగాణ సీఎం అయినా.. వారి మధ్య స్నేహ బంధం కొనసాగుతోంది.. దీంతో, మిత్రుడి ఆహ్వానం మేరకు ఆయన కుమారుడి వివాహానికి హాజరుకాబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వివాహానికి హాజరు అయ్యే అవకాశం ఉండడంతో.. పెళ్లి వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకునే అవకాశం లేకపోలేదు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪಾಲಿಕೆಯ 2026-27ನೇ ಆಯವ್ಯಯವು ‘ಸತ್ವ ಇಲ್ಲದ ಬಜೆಟ್’- ಮಾಜಿ ಮೇಯರ್ ಶಿವಕುಮಾರ್  ಟೀಕೆ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in): ಜನಸ್ನೇಹಿ ಪಾದಚಾರಿ ಮಾರ್ಗಗಳ ಅಭಿವೃದ್ಧಿಗೆ 10 ಕೋಟಿ...

ഇറാന്റെ തിരിച്ചടിയില്‍ സൈനിക താവളങ്ങള്‍ തകര്‍ന്നു; ഹോട്ടലുകളില്‍ അഭയം തേടി അമേരിക്കന്‍ സൈന്യം; റിപ്പോര്‍ട്ട്

വാഷിങ്ടണ്‍: ഇറാന്റെ പ്രത്യാക്രമണത്തില്‍ സൈനിക താവളങ്ങള്‍ തകര്‍ന്നതോടെ, പശ്ചിമേഷ്യയിലെ യു.എസ് സേന...

"நாங்கள் சிரித்துக்கொண்டே அழுகிறோம்.!"- திமுக-வின் தொகுதிப் பங்கீடு குறித்து மதிமுக அர்ஜுனராஜ்

திமுக தங்களுக்கு கொடுத்த எண்ணிக்கை, சின்னம் தொடர்பாக தங்களுக்கு வருத்தம் உள்ளதாக...

Karnataka: క్లాస్‌లోనే విద్యార్థినికి ప్రొఫెసర్ ‘‘ఐ లవ్ యూ’’.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Karnataka: బాధ్యతాయుతమైన ప్రొఫెసర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు....