26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

Off The Record: జగ్గంపేట కూటమిలో అగ్గిరవ్వలు

Date:

Off The Record: అక్కడ కూటమిలో అగ్గి అంటుకుందా? మిత్రులం అన్న సంగతి కూడా మర్చిపోయి టీడీపీ, జనసేన నాయకులు సవాళ్ళు విసురుకుంటున్నారా? చివరికి ఒకరి దారికి ఒకరు అడ్డం పడే స్థాయికి వెళ్ళిపోయారా? ఎక్కడుంది అంత ఘోరమైన సమన్వయ లోపం? అక్కడే ఎందుకు అలా?

Read Also: Vijay Devarakonda : విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాల ఆగ్రహం

కాకినాడ జిల్లా జగ్గంపేట కూటమిలో అగ్గి అంటుకోవడమే కాదు…. అది భగభగ మండే స్థాయికి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన నాయకులు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళడమేకాకుండా… వీధి పోరాటాలకు సిద్ధమవడం కలకలం రేపుతోంది. పహల్గామ్‌ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది జనసేన. అందులో భాగంగా జగ్గంపేటలో కూడా ఆ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తుమ్మలపల్లి రమేష్ మానవహారం నిర్వహించారు. అదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాన్వాయ్ అటువైపు వచ్చింది. ఎమ్మెల్యేకి రోడ్డు క్లియర్‌ చేయమని పోలీసులు చెప్పడంతో.. జనసైనికుల కోపం నషాళానికంటిందట. మేం చేస్తోంది ఏంటి? మీద చెబుతున్నదేంటంటూ పోలీసుల మీద ఫైరైపోయారట. మేం తప్పుకునే ప్రసక్తే లేదు… ఎమ్మెల్యే వచ్చినా.. ఎస్పీ వచ్చినా.. దారి ఇచ్చే మాటేలేదు. మేం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. మధ్యలో తగుదునమ్మా అంటూ మీరొచ్చి తప్పుకోమంటే, పక్కకు ఎలా వెళ్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ.. ఎస్సై రఘునందన్‌రావుతో వాగ్వాదానికి దిగారు జనసేన కో ఆర్డినేటర్ తుమ్మలపల్లి రమేష్. వారం క్రితం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్ని నడి రోడ్డు మీద నిర్వహించారు.. అప్పుడెందుకు రోడ్డు ఎందుకు ఖాళీ చేయించలేదని సీరియస్ అయ్యారు.

Read Also: GT vs RR: గిల్ మళ్లీ మిస్.. బాదేసిన బట్లర్! ఆర్ఆర్ ముందు భారీ టార్గెట్..

కాగా, ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య అప్పటికే ఉన్న అంతరాన్ని బయటపెట్టిందంటున్నారు పరిశీలకులు. రమేష్‌ తీరుపై ఎమ్మెల్యే జ్యోతుల కూడా సీరియస్‌ అయినట్టు సమాచారం. రోడ్డు మీద వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు. జస్ట్‌ నేను వెళ్ళడానికి పాసేజ్‌ ఇవ్వమని మాత్రమే పోలీసులు అడిగారు. అంత చిన్న విషయానికి ఆ స్థాయిలో హడావిడి చేసేసి సీన్‌ క్రియేట్‌ చేయాల్నా అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే, ఏమీ లేని దగ్గర ఏదో బీభత్సం ఉన్నట్టు హంగామా చేయడం ఎందుకన్నది జగ్గంపేట టీడీపీ శ్రేణుల ప్రశ్న. అయితే… అది ఇప్పటికిప్పుడు ఇన్‌స్టంట్‌గా వచ్చిన రియాక్షన్‌ కాదని, బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ వేరే ఉందని అంటున్నారు పరిశీలకులు. అంతకు ముందు ఏ పార్టీలోలేని, కాపు ఉద్యమనేత ముద్రగడ అనుచరుడిగా ఉన్న తుమ్మలపల్లి రమేష్… గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. అదే సమయంలో అప్పటివరకు జనసేన కో ఆర్డినేటర్ గా ఉన్న పాఠం శెట్టి సూర్యచంద్ర తనకు టిక్కెట్‌ రాలేదన్న అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేశారు. దాంతో… వెంటనే రమేష్‌కి పార్టీ జగ్గంపేట బాధ్యతలు అప్పగించింది జనసేన. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో స్థానిక టీడీపీ-జనసేన మధ్య విభేదాలు వచ్చాయన్నది లోకల్‌ టాక్‌.

Read Also: Off The Record: మావోయిస్టులతో చర్చలు.. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తుందా..?

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా జ్యోతుల నెహ్రూ పోటీ చేసినా…. రమేష్ కనీసం కూటమి ధర్మాన్ని పాటించలేదని, అభ్యర్థిగా ఉన్న నెహ్రూకి ఏ మాత్రం సహకరించలేదని చెబుతున్నారు టీడీపీ నాయకులు. అప్పుడు బయటికి తమతో తిరిగినప్పటికీ ఆయన ఉద్దేశం వేరని, లోలోపల చేయాల్సింది చేశారన్నది సైకిల్ పార్టీ వాదన. తన గురువు ముద్రగడ వైసీపీలో చేరిపోయాక తుమ్మలపల్లి జనసేనలో ఉండి కూడా ఎవరికి సహకరించారో… ఏం చేశారో మాకు తెలుసునని అంటున్నారు తమ్ముళ్ళు. ఇక తాజా వివాదానికి వస్తే… జస్ట్‌ సైడ్‌ ఇమ్మన్నారని ఎమ్మెల్యే జ్యోతుల అంటుంటే….. తుమ్మలపల్లి వెర్షన్‌ మాత్రం మరోలా ఉంది. కూటమి భాగస్వామిగా తాము ఒక కార్యక్రమం చేస్తుంటే…. అందుకు మద్దతయినా ఇవ్వాలి, లేదంటే.. కొద్దిసేపు వెయిట్ చేయాలే తప్ప.. ఆ హంగామా ఎందుకన్నది ఆయన క్వశ్చన్‌. అయితే, వీళ్ళిద్దరికీ లాంగ్‌ లాంగ్‌ ఎగో పగలు కూడా ఉన్నాయట. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు రమేష్. అప్పుడు జగ్గంపేట పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు జ్యోతుల. నాటి ట్రయాంగిల్ ఫైట్‌లో కేవలం 789 ఓట్లు తేడాతో ఓటమి పాలయ్యారాయన. నాడు తనకు వ్యతిరేకంగా రమేష్.. కొంతమందిని ఎంకరేజ్ చేయడం వల్లే చాలా తక్కువ మార్జిన్‌తో ఓడిపోయానన్న అభిప్రాయం జ్యోతుల నెహ్రూకి ఉన్నట్టు చెబుతారు.

Read Also: Pakistan: భారత్ దెబ్బకు పాకిస్థాన్ మార్కెట్ కుదేలు.. కిలో చికెన్ రూ.800!

ఇక, అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కూడా రమేష్‌ కూటమి గురించి పట్టించుకోకుండా తన వ్యక్తిగత వైరాన్ని తెర మీదికి తెస్తున్నారన్నది లోకల్‌ టీడీపీ వాయిస్‌. ఈ పరిస్థితుల్లో… జగ్గంపేట కూటమిలో విభేదాలు అంత త్వరగా సెట్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. వివాదం పార్టీలది కాదు, ఇద్దరు నాయకుల వ్యక్తిగతం అంటున్నా…. అంతిమంగా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తోంది రెండు పార్టీలకే కాబట్టి… అది ఖచ్చితంగా కూటమికి అంటుకుంటుందని అంటున్నారు. ఈ అగ్గిని ఇప్పుడే ఆర్పేయకుంటే… జగ్గంపేట కూటమిలో విభేదాలు ఎప్పటికీ రగులుతూనే ఉంటాయంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

திடீரென டிஜிபி அலுவலகத்தில் விஜய்; யார் மீது புகார் கொடுத்தார்? – விவரம் என்ன?

தவெக தலைவர் விஜய் திடீரென சென்னை டிஜிபி அலுவலகத்திற்கு நேரில் சென்று...

Delhi Metro: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో పేలుడు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు

దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో...

ಪಾಲಿಕೆಯ 2026-27ನೇ ಆಯವ್ಯಯವು ‘ಸತ್ವ ಇಲ್ಲದ ಬಜೆಟ್’- ಮಾಜಿ ಮೇಯರ್ ಶಿವಕುಮಾರ್  ಟೀಕೆ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in): ಜನಸ್ನೇಹಿ ಪಾದಚಾರಿ ಮಾರ್ಗಗಳ ಅಭಿವೃದ್ಧಿಗೆ 10 ಕೋಟಿ...