26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్ర దాడిపై ప్రధాని మోడీ ఆరా.. అమిత్ షాకు కీలక ఆదేశం..

Date:

Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించింది.

Read Also: Sunitha: ప్రవస్తిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశా.. మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది!

ఇదిలా ఉంటే, సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఈ టెర్రరిస్ట్ అటాక్‌పై ఆరా తీశారు. దాడి గురించిన వివరాలను జెడ్డాలో ఉన్న ప్రధానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలియజేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించాల్సిందిగా అమిత్ షాని ప్రధాని మోడీ ఆదేశించారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులతో అమిత్ షా వర్చువల్‌గా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని విడిచే ప్రసక్తే లేదని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪಾಲಿಕೆಯ 2026-27ನೇ ಆಯವ್ಯಯವು ‘ಸತ್ವ ಇಲ್ಲದ ಬಜೆಟ್’- ಮಾಜಿ ಮೇಯರ್ ಶಿವಕುಮಾರ್  ಟೀಕೆ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in): ಜನಸ್ನೇಹಿ ಪಾದಚಾರಿ ಮಾರ್ಗಗಳ ಅಭಿವೃದ್ಧಿಗೆ 10 ಕೋಟಿ...

ഇറാന്റെ തിരിച്ചടിയില്‍ സൈനിക താവളങ്ങള്‍ തകര്‍ന്നു; ഹോട്ടലുകളില്‍ അഭയം തേടി അമേരിക്കന്‍ സൈന്യം; റിപ്പോര്‍ട്ട്

വാഷിങ്ടണ്‍: ഇറാന്റെ പ്രത്യാക്രമണത്തില്‍ സൈനിക താവളങ്ങള്‍ തകര്‍ന്നതോടെ, പശ്ചിമേഷ്യയിലെ യു.എസ് സേന...

"நாங்கள் சிரித்துக்கொண்டே அழுகிறோம்.!"- திமுக-வின் தொகுதிப் பங்கீடு குறித்து மதிமுக அர்ஜுனராஜ்

திமுக தங்களுக்கு கொடுத்த எண்ணிக்கை, சின்னம் தொடர்பாக தங்களுக்கு வருத்தம் உள்ளதாக...

Karnataka: క్లాస్‌లోనే విద్యార్థినికి ప్రొఫెసర్ ‘‘ఐ లవ్ యూ’’.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Karnataka: బాధ్యతాయుతమైన ప్రొఫెసర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు....