26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

Suicide: మరో యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్స్.. షర్ట్‌పై కీలక అంశం రాసి సూసైడ్..

Date:

ఆన్‌లైన్‌ గేమ్స్ మరో యువకుడి ప్రాణాలు తీసింది. బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైరేట్‌ గ్రామానికి చెందిన జైచంద్రగా గుర్తించారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దంటూ షర్ట్‌పై రాసుకున్నాడు యువకుడు. అయితే.. బెట్టింగుల కారణంగా తీవ్ర అప్పుల పాలై అవి తీర్చలేక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

READ MORE: CM Chandrababu: చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై పుస్తకాల ఆవిష్కరణ..

సమాజంలో బెట్టింగ్​లు తొలుత సరదాగా మొదలై చివరికది వ్యసనంగా మారుతున్నాయి. బెట్టింగ్‌ భూతం బారిన పడి ఎంతోమంది బలైపోతున్నారు. ఆ ఉచ్చులోంచి బయటపడలేక ఏదో ఒక రోజు గెలుస్తామని సమాధానం చెప్పుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు ఆ అప్పులు తీర్చలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, హోటళ్లు, టీకేఫ్‌లు, పార్కులు, క్రీడామైదానాలు ఇలా ఎక్కడబడితే అక్కడ యువత, విద్యార్థులు పనులు మానుకుని మరీ గంటలసేపు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతున్నారు. ఒక్కోసారి సహనం కోల్పోయి గొడవలకు దిగుతున్నారు. ఇలాంటిచోట పోలీసులు నిఘా పెంచితే కొంతవరకైనా ఫలితం ఉంటుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಜನರ, ಪಕ್ಷದ ಬೆಂಬಲ ಇಲ್ಲದಿದ್ದರೇ ನಾನು 17 ಬಜೆಟ್ ಮಂಡಿಸಲು ಹೇಗೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತಿತ್ತು-ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in):  ನನಗೆ ರಾಜ್ಯದ ಜನರ ಪಕ್ಷದ ಹೈಕಮಂಢ್  ಬೆಂಬಲ...

സാദിഖലി തങ്ങളെ അപകീർത്തിപ്പെടുത്തിയുള്ള ഫേസ്ബുക്ക് പോസ്റ്റ്: കാപ്പ കേസ് പ്രതി ആവശ്യപ്പെട്ടത് 15 കോടി

മലപ്പുറം: സാദിഖലി തങ്ങളെ അപകീർത്തിപ്പെടുത്തിയുള്ള ഫേസ്ബുക് പോസ്റ്റിന് പിറകിലെ ലക്ഷ്യം ബ്ലാക്ക്...

ஸ்டாலின் Vs விஜய்… பெண்கள் வாக்குகளை வளைப்பதில் தீவிரம் | ‘வாவ்’ வியூகம் 10

பெண்கள் வாக்குகளை வளைப்பதில் தீவிரம்‘வாவ்’ வியூகம் 10வாக்காளர்கள் எதிர்பார்த்த ஜனநாயகத் திருவிழா...

Mermaid: రేజర్ షార్ప్ పళ్లు, చేప తోకతో మమ్మీ.. జపాన్‌లో సగం చేప సగం మానవుడి మెర్‌మెయిడ్

జపాన్‌లోని ఫుకుషిమాలోని ఒక పాత ఇంట్లో ఒక విచిత్రమైన మమ్మీ వెలుగుచూసింది....