తమిళనాడులో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ ఇరాకటంలో పడ్డారు. ఆయన తీరుపై ముస్లింలు మండిపడుతున్నారు. రంజాన్ మాసంలో ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందుపై సున్నీ ముస్లిం మతాధికారి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఫత్వా జారీ చేశారు.
ఫత్వాలో ముస్లిం సమాజం విజయ్‌ను నమ్మొద్దని కోరారు. తన సినిమాలైన ‘కత్తి’, ‘బీస్ట్’ చిత్రాల్లో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇప్పుడు రాజకీయ అవతారం ఎత్తి ముస్లింలతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని చూస్తున్నారని.. ముస్లింలు ఎవరూ ఆయనతో ఉండొద్దని హెచ్చరించారు. ఇక ఇఫ్తార్ విందుకు రౌడీలను, ముస్లింలు కానీ వారిని పిలిచారని.. ఎప్పుడూ ఉపవాసం ఉండని వారిని విందుకు పిలిచారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీవీకే తోసిపుచ్చింది.





