25
March, 2026

A News 365Times Venture

25
Wednesday
March, 2026

A News 365Times Venture

MI vs DC: ఢిల్లీలో రెచ్చిపోయిన ముంబై బ్యాటర్లు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

Date:

MI vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు (ఏప్రిల్ 13) న ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో… ప్రారంభంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 12 బంతుల్లో 18 పరుగులు చేసి త్వరగా వెనుదిరిగినప్పటికీ, ర్యాన్ రికెల్టన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు అద్భుతంగా ఆడారు.

ఆ తర్వాత, మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ చెలరేగి ఆడాడు. 33 బంతుల్లో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్ లో మరోసారి కీలక పాత్ర పోషించాడు. ఆఖర్లో నామన్ ధీర్ 17 బంతుల్లో 38 పరుగులతో జట్టును భారీ స్కోర్‌కు చేర్చాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. తన 4 ఓవర్లలో కేవలం 23 పరుగులే ఇవ్వడంతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. విప్రాజ్ నిగమ్ కూడా రెండు వికెట్లు తీశాడు. కానీ మిగిలిన బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చారు. మొత్తంగా ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 205/5 స్కోరు చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం ఉందని చెప్పొచ్చు. ముంబై విజయం సాధించాలంటే బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఉంది. ఇక చూడాలి మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఈ లక్ష్యాన్ని ఛేదించగలదా లేదా? అని.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nepal: శ్రీరామ నవమి రోజున నేపాల్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం..

Nepal: నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన...

ಗ್ಯಾಸ್ ಚಾರ್ಜ್ ಎಂದು ಹೆಚ್ಚುವರಿ ಹಣ ವಸೂಲಿ ಮಾಡುವಂತಿಲ್ಲ: ಹೋಟೆಲ್ ಗಳಿಗೆ ಕೇಂದ್ರ ಖಡಕ್ ಸೂಚನೆ

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,25,2026 (www.justkannada.in):  ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಅಭಾವದ ನೆಪ ಹೇಳಿ ಬಿಲ್...

ഫലസ്തീനെ ദ്രോഹിക്കാനുള്ള ലൈസന്‍സ് ലോകം ഇസ്രഈലിന് നല്‍കി: ഫ്രാന്‍സെസ്‌ക ആല്‍ബനീസ്

ന്യൂയോര്‍ക്: ഇസ്രഈലിനെതിരെ രൂക്ഷ വിമര്‍ശനവുമായി ഐക്യരാഷ്ട്രസഭയുടെ പ്രത്യേക പ്രതിനിധി ഫ്രാന്‍സെസ്‌ക ആല്‍ബനീസ്....

'மூப்பனாரின் ஆன்மா மன்னிக்காது.!' – பாஜகவிடம் கட்சியை அடகு வைத்த ஜி.கே.வாசன்?

என்.டி.ஏ கூட்டணியில் 5 தொகுதிகளை வாங்கிக் கொண்டு பாஜக-வின் தாமரை சின்னத்தில்...