14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

Kakani Govardhan Reddy: నెల్లూరు, హైదరాబాద్‌లో లేని కాకాణి.. పోలీసుల గాలింపు..!

Date:

Kakani Govardhan Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు దొరకడం లేదు.. ఆదివారం రోజు నెల్లూరులోని మాజీ మంత్రి ఇంటికి పోలీసులు నోటీసులు తీసుకొని వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో.. ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు పోలీసులు.. మరోవైపు.. హైదరాబాద్‌లో ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు.. అయితే, అక్కడ కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో.. సంబంధిత నోటీసులను కుటుంబ సభ్యులకు అందజేశారట పోలీసులు..

Read Also: Sharwanand : శర్వానంద్ ‘నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..

ఇక, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ రేపటికి వాయిదా పడింది.. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నిన్న నోటీసులు జారీ చేశారు పోలీసులు.. ఆ నోటీసుల ప్రకారం.. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. కాకాణి మాత్రం హాజరుకాలేదు.. ఆదివారం రోజు నెల్లూరులోని కాకాణి ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు.. ఈ రోజు హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి వెళ్లారు.. అక్కడ కూడా కాకాణి అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు.. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. కేసు నమోదు నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ తోపాటు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. రేపు హై కోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్‌ విచారణకు రానుంది.. మరోవైపు, నెల్లూరుతో పాటు హైదరాబాద్ లో కూడా కాకాణి లేకపోవడంతో.. ఆయన కోసం పోలాసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Read Also: Sharwanand : శర్వానంద్ ‘నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..

కాగా, చెన్నైలో నివాసముండే విద్యా కిరణ్‌కు పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని 32 ఎకరాల్లో రుస్తుం మైన్‌ పేరిట మైకా తవ్వకాలకు అనుమతి ఉండగా.. లీజు గడువు ముగియడంతో పునరుద్దరణకు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు.. గత ప్రభుత్వ హయాంలో తెల్లరాయి గనులపై ఆ పార్టీ నేతలు కన్నేశారని.. లీజుదారుడు అంగీకరించకపోయినా కొందరు ప్రజాప్రతినిధుల అండతో దౌర్జన్యంగా తెల్లరాయిని తరలించారనే ఆరోపణలు ఉన్నాయి.. అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాణి.. సొంత గ్రామం తోడేరుకు సమీపంలోనే మైనింగ్‌కు పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి.. దీనిపై టీడీపీకి చెందిన మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోన్న విషయం విదితమే..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ವಾಟಾಳ್‌ ನಾಗರಾಜು ಅವರಿಗೆ ರಾಜ್ಯೋತ್ಸವ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಲು ಆಗ್ರಹ: ಸದನದಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಟ್ಟ ಸಚಿವ ಶಿವರಾಜ್ ತಂಗಡಗಿ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,13,2026 (www.justkannada.in): ಕನ್ನಡಪರ ಹೋರಾಟಗಾರ ವಾಟಾಳ್‌ ನಾಗರಾಜು ಅವರಿಗೆ ರಾಜ್ಯೋತ್ಸವ...

കേരളം എല്ലാവര്‍ക്കും റേഷന്‍ ഉറപ്പാക്കിയ രാജ്യത്തെ ഏക സംസ്ഥാനം: മന്ത്രി ജി.ആര്‍. അനില്‍

തിരുവനന്തപുരം: രാജ്യത്ത് എല്ലാ കുടുംബങ്ങള്‍ക്കും റേഷന്‍ ഉറപ്പാക്കിയ ഏക സംസ്ഥാനമാണ് കേരളമെന്ന്...

மோனலிசா போஸ்லேவுக்கு 18 வயது பூர்த்தி ஆகும் முன்பே திருமணம் நடந்ததா? விவாதத்துக்கு காரணம் என்ன?

பிரயாக்ராஜில் கடந்த ஆண்டு நடந்த மகா கும்பமேளாவில் ருத்ராட்சம் மற்றும் மாலைகள்...

Mother Daughter Suicide: పెళ్లి ఇంట్లో చావు కేకలు! వరుడి నిందలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆమె తల్లి బలి..

Mother Daughter Suicide: పెళ్లి కాకముందే.. యువతిని అనుమానించాడు.. నీ ప్రవర్తన...