20
March, 2026

A News 365Times Venture

20
Friday
March, 2026

A News 365Times Venture

Betting Apps Case: సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. బెట్టింగ్ యాప్స్ వివాదంపై రానా దగ్గుబాటి క్లారిటీ..

Date:

బెట్టింగ్ యాప్స్‌ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మియాపూర్‌ పీఎస్‌ పరిధలో 25మందిపై నమోదు నమోదు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై విజయ్, ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా రానా దగ్గుబాటి కూడా వివరణ ఇచ్చారు.

READ MORE: Betting Apps Case: పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు అందుకే.. బెట్టింగ్ యాప్స్ కేసులపై మాదాపూర్ డీసీపీ వివరణ

“నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని గడువు 2017లో ముగిసింది. ఆన్‌లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్‌లను చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమోదం తెలిపారు. ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్ని భాగస్వామ్యాలను క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. చట్టపరమైన సమీక్ష తర్వాత, చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉండేలా ప్లాట్‌ఫామ్‌ను రానా అంగీకరించాడు. నైపుణ్యం ఆధారిత గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను రానా దగ్గుబాటి ఆమోదించడం చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికే నిర్ధారించడానికి ఈ ప్రెస్ నోట్ జారీ చేస్తున్నాం. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్‌లైన్ గేమ్‌లను హైలైట్ చేయడం చాలా అవసరం. ఈ గేమ్‌లు అవకాశం మీద కాకుండా నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని, అందువల్ల చట్టబద్ధంగా అనుమతించబడతాయని కోర్టు తీర్పు ఇచ్చింది.” అని రానా దగ్గుబాటి పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

താനൂരില്‍ നിന്നും തിരൂരിലേക്ക്; വി. അബ്ദുറഹിമാന്‍ മണ്ഡലം മാറി

മലപ്പുറം: താനൂര്‍ മണ്ഡലത്തില്‍ എല്‍.ഡി.എഫ് സ്ഥാനാര്‍ത്ഥിയായി പ്രഖ്യാപിച്ചിരുന്ന വി. അബ്ദുറഹിമാന്‍ മണ്ഡലം...

'6 சீட்டுனா பேசுறதுக்கு கூப்பிடுங்க, இல்லன்னா..!'- கறார் சி.பி.எம்; இறங்கி வராத திமுக? பின்னணி என்ன?

திமுக - சி.பி.எம் இடையேயான தொகுதி பங்கீட்டில் இழுபறி ஓய்ந்தபாடில்லை. மூன்று...

Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

Off The Record: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు ఎక్కువ....

കോണ്‍ഗ്രസിന്റെ രണ്ടാംഘട്ട സ്ഥാനാര്‍ത്ഥി പട്ടിക പ്രഖ്യാപിച്ചു; കണ്ണൂരില്‍ ടി.ഒ മോഹനന്‍, അബിന്‍ വര്‍ക്കിയും സന്ദീപ് വാര്യരും പട്ടികയില്‍

തിരുവനന്തപുരം: ഏറെ അനിശ്ചിതത്വത്തിനും ചര്‍ച്ചകള്‍ക്കുമൊടുവില്‍ നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പിനുള്ള കോണ്‍ഗ്രസിന്റെ രണ്ടാം ഘട്ട...