19
March, 2026

A News 365Times Venture

19
Thursday
March, 2026

A News 365Times Venture

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి బిగ్‌ షాక్‌.. మరో కేసులో ఏప్రిల్‌ 1 వరకు రిమాండ్‌..

Date:

Vallabhaneni Vamsi Case: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోషాక్‌ తగిలింది.. ఇప్పటికే సత్యవర్ధన్‌ కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు..

Read Also: Posani Krishna Murali Case: థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? పోసానిని ప్రశ్నించిన జడ్జి

కాగా, కబ్జా కేసులో వల్లభనేని వంశీ మోహన్‌పై నమోదైన కేసులో కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతి ఇవ్వటంతో గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరిచారు పోలీసులు.. విజయవాడ సబ్‌జైలులో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకుని.. గన్నవరం తరలించిన ఆత్మకూరు పోలీసులు.. గన్నవరం కోర్టులో వల్లభనేని వంశీ మోహన్‌ను హాజరుపరిచారు.. అయితే, ఆత్మకూరు పీఎస్‌లో నమోదైన భూ కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది గన్నవరం కోర్టు.. అనంతరం తిరిగి విజయవాడ సబ్ జైలుకు వంశీని తరలించారు పోలీసులు.. ఇప్పటికే సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్‌లో ఉన్న వల్లభనేని వంశీకి.. తాజా రిమాండ్‌తో బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది.. అంటే.. రిమాండ్‌లో ఉండగానే.. మరో రిమాండ్‌ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕಮರ್ಷಿಯಲ್ ಸಿಲಿಂಡರ್ ಅಭಾವ: ಒಂದು ವಾರ ಸಹಿಸಿಕೊಳ್ಳಿ – ಸಚಿವ ಕೆ.ಎಚ್ ಮುನಿಯಪ್ಪ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ  ಕಮರ್ಷಿಯಲ್ ಸಿಲಿಂಡರ್ ಅಭಾವವಿದೆ. ಹೋಟೆಲ್ ನವರು...

യു.എസ് ഉപരോധത്തിന് മറുപടി;എണ്ണയും വാതകവുമായി രണ്ട് റഷ്യന്‍ കപ്പലുകള്‍ ക്യൂബയിലേക്ക്; റിപ്പോര്‍ട്ട്

ഹവാന: യു.എസ് ഉപരോധത്തിന് പിന്നാലെ ഇരുട്ടിലായ ക്യൂബയ്ക്ക് ആശ്വാസവുമായി റഷ്യയുടെ എണ്ണയും...

கத்தார் எரிவாயு முனையம் மீது தாக்குதல்: உலகளவில் எகிறும் எரிசக்தி விலை – இந்தியாவிற்கு நெருக்கடி!

அமெரிக்க - இஸ்ரேல் படைகள் ஈரான் மீது நடத்திய தாக்குதலுக்குப் பதிலடியாக,...

Samsung భారీ ఆఫర్.. సగం ధరకే Galaxy S26 Ultra స్మార్ట్‌ఫోన్.. !

శాంసంగ్ తన వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మకమైన ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీమియం...