17
March, 2026

A News 365Times Venture

17
Tuesday
March, 2026

A News 365Times Venture

HUDCO-CRDA: హడ్కో-సీఆర్‌డీఏఎం మధ్య ఒప్పందం.. రాజధాని నిర్మాణాలకు 11 వేల కోట్లు!

Date:

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో), ఏపీ క్యాపిటల్‌ రీజియన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్‌డీఏ) మధ్య ఒప్పందం జరిగింది. ఉండవల్లి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్‌ కుల్‌శ్రేష్ఠ, మునిసిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11,000 కోట్లు రుణంగా అందించనుంది.

జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో రాజధాని నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఇవాళ సీఆర్‌డీఏతో ఒప్పందం చేసుకున్నారు. ఇక రాజధాని నిర్మాణ పనులకు హడ్కో రూ.11,000 కోట్లు రుణంగా అందించనుంది. ఈ ఒప్పందం కోసం హడ్కో సీఎండీ సంజయ్‌ కుల్‌శ్రేష్ఠ శనివారం విజయవాడ చేరుకున్నారు. ఆయనకు పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎంపీ బాలశౌరి ఘన స్వాగతం పలికారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯರನ್ನ ಹೊಗಳಿದ ಜೆಡಿಎಸ್ MLC

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,17,2026 (www.justkannada.in):  ಸದನದಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯರನ್ನು ವಿಧಾನಪರಿಷತ್ ಜೆಡಿಎಸ್ ಸದಸ್ಯ ...

വി.ഡി സതീശന്‍ സീറ്റ് ഉറപ്പ് നല്‍കിയിട്ടും വൈക്കത്ത് പരിഗണിച്ചില്ല, എന്തുകൊണ്ട്? അതൃപ്തി പരസ്യമാക്കി സണ്ണി എം. കപിക്കാട്

കോട്ടയം: വൈക്കം നിയമസഭാ മണ്ഡലത്തില്‍ തന്നെ പരിഗണിക്കുന്നുണ്ടെന്ന് പ്രതിപക്ഷ നേതാവ് വി.ഡി....

`தத்துக்குழந்தையின் வயது எதுவாகினும் தாய்க்கு மகப்பேறு விடுப்பு உண்டு' – உச்ச நீதிமன்றம் தீர்ப்பு!

தத்தெடுக்கும் குழந்தையின் வயது எவ்வளவாக இருந்தாலும் தாய்க்கு மகப்பேறு விடுப்புக்கு உரிமை...

Trump-NATO: నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం.. మిత్రుల సహాయం అక్కర్లేదని వెల్లడి

ఇరాన్‌తో యుద్ధం వేళ నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....