17
March, 2026

A News 365Times Venture

17
Tuesday
March, 2026

A News 365Times Venture

YS Viveka Murder Case: వాచ్‌మెన్‌ రంగన్న మృతిపై సిట్ ఏర్పాటు.. రేపు రీపోస్టుమార్టం..!

Date:

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి, వాచ్‌మెన్‌ రంగన్న మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రంగన్న మృతి గల కారణాలను సమగ్రంగా విచారించడం కోసం కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతిపై పలు అనుమానాలు రావడంతో సిట్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టనున్నారు. సిట్ బృందంలో ఒక డీఎస్పీతో పాటు ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 6 మంది కానిస్టేబుల్స్ తో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు.. గురువారం పోస్టుమార్టం అనంతరం రంగన్న మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, రంగన్న మృతిపై అనుమానాలు రావడంతో సమగ్ర విచారణకు మరో మారు రీ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పులివెందులలో రంగన్న మృతదేహానికి రేపు నలుగురు వైద్యుల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించి మరిన్ని నమూనాలను సేకరించనున్నారు.

Read Also: International Women’s Day: ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” స్టోరీ ఇదే..

అయితే, వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక సాక్షి, వాచ్‌మెన్‌ రంగన్న మృతిపై కూడా ఏపీ కేబినెట్‌లో చర్చ జరిగింది. వివేకా హత్య కేసులో సాక్షులు, నిందితులుగా ఉన్నవారిలో నలుగురు చనిపోవడంపై మంత్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. పరిటాల రవి హత్య కేసులో కూడా సాక్ష్యులు ఇలానే చనిపోయారని సీఎం చంద్రబాబుకు చెప్పారు. రంగన్న మృతి అనుమానాస్పదంగా ఉందని సీఎం చంద్రబాబు కూడా అభిప్రాయపడ్డారు. దీనిపై డీజీపీ హరికుమార్‌ గుప్తాను వివరణ కోరగా… ఆ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. దీంతో.. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించింది కేబినెట్‌. ఇక, ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై విచారణ చేస్తామన్న ఆమె.. సాక్షుల వరుస మరణాల అంశంపై కేబినెట్‌లో చర్చించాం సమగ్ర దర్యాప్తు జరపాలని అదేశించాం అన్నారు.. ఈ కేసులో ప్రధాని సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగన్న మృతి డైవర్షన్ అనాలో లేదా కొసమెరుపు అనాలో అర్థం కావడం లేదన్నారు.. రంగన్న మరణంపై పోస్ట్ మార్టం తరువాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. వివేక హత్య కేసులో ఎవరి మరణాలు అయినా మిస్టరీగా మాత్రం మిగలవు. వివేక హత్య కేసులో ఎవ్వరూ తప్పు చేసిన శిక్ష తప్పదు. కొంగ జపాలు చేసిన తలకిందులుగా తపస్సు చేసినా.. తప్పు చేసిన వారికి శిక్ష మాత్రం తప్పదు హోం మంత్రి వంగలపూడి అనిత వార్నింగ్‌ ఇచ్చిన విషయం విదితమే.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ವಿತರಣೆಯಲ್ಲಿ ಸಮಸ್ಯೆಯಾದ್ರೆ ಆಹಾರ ನಿರೀಕ್ಷಕರನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ: ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ

ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ, ಮಾರ್ಚ್,16,2026 (www.justkannada.in): ಜಿಲ್ಲೆಯಾದ್ಯಂತ ಎಲ್ ಪಿಜಿ ಸಿಲಿಂಡರ್...

Bihar Rajya Sabha Election; എ.ഐ.എം.ഐ.എമ്മും ബി.എസ്.പിയും വോട്ട് ചെയ്തു; കോണ്‍ഗ്രസ്-ആര്‍.ജെ.ഡി എം.എല്‍.എമാര്‍ വിട്ടുനിന്നു, എന്‍.ഡി.എയ്ക്ക് വിജയം

പാട്‌ന: ബീഹാറിലെ രാജ്യസഭാ സീറ്റുകളിലേക്കുള്ള തെരഞ്ഞെടുപ്പില്‍ എന്‍.ഡി.എ സഖ്യത്തിന് വിജയം. സംസ്ഥാനത്തെ...

பேராவூரணி தொகுதியை கூட்டணிக்கு தரமாட்டார் எடப்பாடி! – அதிமுக வேட்பாளர் ரேஸில் முந்துவது யார்?

தஞ்சாவூர் மாவட்டத்தில் உள்ள எட்டு சட்டமன்றத் தொகுதிகளில் ஒன்று பேராவூரணி. கடமைடை...

Nepali Gang : అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశారు..

హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. జస్ట్ ఇంట్లో పని మనుషులుగా...