16
March, 2026

A News 365Times Venture

16
Monday
March, 2026

A News 365Times Venture

TG Inter Exams: ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు

Date:

తెలంగాణలో బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే విద్యార్థులు కూడా పుస్తకాలు ముందు వేసుకుని చదువుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల్లో పరీక్షల ఫీవర్ మొదలు కాబోతుంది.

ఇది కూడా చదవండి: Harshavardhan: ‘స్పిరిట్’ కోసం కసిగా పనిచేస్తున్నాను

ఇక బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 9 లక్షల 96,971 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ ఫస్టియర్‌తో పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5, 08,523 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 1532 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 29,992 మంది ఇన్విజిలేటర్స్‌ను ఏర్పాటు చేశారు.

జిరాక్స్ సెంటర్లు మూసివేత..
గతంలో పేపర్ లీకేజీ వార్తల నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తం అయింది. ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా పరీక్ష సమయంలో ఎగ్జామ్ సెంటర్ల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఇక ప్రతి ఎగ్జామ్ సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి అనుసంధానం చేయనున్నారు. ఏ కారణం చేతనైనా విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకపోతే సంబంధిత కాలేజీల పైన చర్యలు ఉంటాయని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఇక పరీక్ష సమయానికి అరగంట(ఉదయం 8.30 కి) ముందే అభ్యర్థులు పరీక్ష హాల్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: NANI : నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ గ్లిమ్స్.. నెవర్ బిఫోర్..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘ചിറയിന്‍കീഴില്‍ കോഴിക്കോട്ടുകാരി വേണ്ട’; രമ്യ ഹരിദാസിന്റെയും സണ്ണി ജോസഫിന്റെയും കോലം കത്തിച്ച് പ്രതിഷേധം

തിരുവനന്തപുരം: ചിറയിന്‍കീഴ് കോണ്‍ഗ്രസില്‍ പൊട്ടിത്തെറി. ആലത്തൂര്‍ മുന്‍ എം.പിയായ രമ്യ ഹരിദാസിനെ...

50,000 ரூபாய்க்கு மேல் எடுத்துச் செல்லக் கூடாது! – அமலுக்கு வந்த தேர்தல் நடத்தை விதிமுறைகள்

தமிழ்நாடு, மேற்கு வங்கம், அசாம், கேரளா மற்றும் புதுச்சேரி ஆகிய மாநிலங்கள்...

എ. പത്മകുമാറിനെ വെട്ടി; ആറന്മുള മണ്ഡലം എല്‍.ഡി.എഫ് കണ്‍വീനര്‍ സ്ഥാനം നഷ്ടപ്പെട്ടു

പത്തനംതിട്ട: ശബരിമല സ്വര്‍ണക്കൊള്ള കേസിലെ പ്രതിയും മുന്‍ എം.എല്‍.എയും സി.പി.ഐ.എം നേതാവുമായ...